టాలీవుడ్ నటుడు నారా రోహిత్ కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది.ఆయన భార్య శిరీష పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. ప్రస్తుతం తల్లి, బిడ్డ ఇద్దరూ సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారని సమాచారం.దీంతో వారి కుటుంబంలో సంతోష వాతావరణం నెలకొంది.ఈక్రమంలోనే నారా రోహిత్ దంపతులకు అభిమానులు, సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
నారా రోహిత్, శిరీషను ప్రేమ వివాహం చేసుుకున్నారు.’ప్రతినిధి 2′ చిత్రంలో కలిసి నటించినప్పుడు వీరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. పెద్దల అంగీకారంతో 2024 అక్టోబర్ 13న నిశ్చితార్థం చేసుకోగా, 2025 అక్టోబర్ 30న హైదరాబాద్‌లో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకకు ఏపీ సీఎం నారా చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. పెళ్లయిన ఏడాదిలోపే తమ బంధానికి గుర్తుగా వారసుడు రావడంతో రోహిత్ ఇంట ఆనందం వెల్లివిరిసింది.
కెరీర్ విషయానికి వస్తే, నారా రోహిత్ ఇటీవల ‘సుందరకాండ’ చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్నారు. విక్టరీ వెంకటేశ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో వస్తున్న ‘ఆదర్శ కుటుంబం’ అనే చిత్రంలో ఆయన కీలక పాత్ర పోషిస్తున్నారు. దసరాకు విడుదల కానున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి.దీంతో పాటు సోలో హీరోగా మరో ప్రాజెక్టుకు కూడా ఆయన సంతకం చేశారని సమాచారం.
అనంతపురం జిల్లా టీడీపీకి కంచుకోట: నారా లోకేష్ #NaraLokesh #tdp #manatv #NaraLokesh #Anantapur #Anantapuram #tdp #TeluguDesamParty #TDPNews…
Lokesh Praises Kalava Srinivasulu’s Dedication & Leadership #NaraLokesh #KalavaSrinivasulu #manatv #NaraLokesh #KalavaSrinivasulu #TDP #TeluguDesamParty #AndhraPradesh…
#SandeepReddyVanga About #ArjunReddy #movieupdates #viralshorts #ManTV #SandeepReddyVanga #ArjunReddy #ArjunReddyMovie #DeletedScenes #BehindTheScenes #MovieEditing #Tollywood #TeluguCinema #Vanga…
No Money, Just an Idea! Dr. M.S. Reddy’s Billion-Dollar Lesson #pizzahut #dominos #ManTVlive #DrMSReddy #PizzaHut…
How to Become a Trillionaire? The Mindset Behind Massive Success #manatvlive #Trillionaire #TrillionaireMindset #SuccessMindset #MillionaireMindset…
ఈ కథ నాకు చాలా నచ్చింది : సందీప్ రెడ్డి వంగ #Romanchakam #SandeepReddyVanga #Tollywood #manatvlive #Romanchakam #RomanchakamTrailer…