Categories: Movie News

పాలిటిక్స్ లోకి ధనుష్.? వైరల్ గా ఫ్యాన్స్ క్లబ్ జెండా

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ పేరు సోషల్ మీడియాలో మారుమోగిపోతుంది. దీనికి కారణం ఆయన కొత్త సినిమా కాదు.. ఆయన అభిమాన సంఘం ఆవిష్కరించిన అధికారిక జెండా. దీంతో తమిళ రాజకీయాల్లోకి ధనుష్ అడుగుపెట్టబోతున్నారనే ఊహాగానాలు ఊపందుకున్నాయి.

అభిమాన సంఘం ఆవిష్కరించిన జెండాలో ధనుష్ చేతులు జోడించి, నమస్కరిస్తున్న పోజ్‌లో కనిపిస్తున్నారు. బ్యాక్‌గ్రౌండ్‌లో ఎరుపు, తెలుపు రంగులతో డిజైన్ చేసిన ఫ్లాగ్… రాజకీయ పార్టీ జెండాను తలపించేలా ఉంది. దీంతో ప్రతి ఒక్కరి చూపు దానిపైనే పడింది. ఈ నేపథ్యంలోనే అభిమానులు మాత్రమే కాదు… రాజకీయ విశ్లేషకులు కూడా దీనిపై చర్చిస్తున్నారని తెలుస్తోంది.

అయితే, ఈ హడావిడి ప్రస్తుతానికి ఫ్యాన్స్ క్లబ్ స్థాయిలోనే జరుగుతోంది. దీనిపై అటు ధనుష్ గానీ, ఇటు ఆయన పీఆర్ టీమ్ గానీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ప్రస్తుతం పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్న ధనుష్, కేవలం తన అభిమానుల గుర్తింపు కోసమే ఈ జెండాను అనుమతించారా? లేక దీని వెనుక ఏదైనా లాంగ్ టర్మ్ పొలిటికల్ స్కెచ్ ఉందా? అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిల్ చేయాల్సిందే. ఏదీఏమైనప్పటికీ, తమిళ పాలిటిక్స్ లో ఈ ‘జెండా’ మాత్రం హాట్ టాపిక్ గా మారింది.

ManaTV Team

Recent Posts

వరల్డ్ కప్ గెలుచుకున్న ఆస్ట్రేలియా టీమ్ పై కాసుల వర్షం.. టీమిండియాకు ఎంతంటే.?

విమెన్స్ టీ20 వరల్డ్ కప్ 2026 ట్రోఫీని గెలుచుకున్న వరల్డ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా టీమ్‌పై కాసుల వర్షం కురిసింది. కేవలం…

2 hours ago

క్రేజీ మల్టీస్టారర్ ప్రాజెక్ట్!! అడివి శేష్ బాలీవుడ్ ఎంట్రీ?..

టాలీవుడ్ టాలెంటెడ్ యాక్టర్ అడివి శేష్ త్వరలోనే బాలీవుడ్ చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారని తెలుస్తోంది. కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలతో…

3 hours ago

ఏనుగు దంతాల కేసులో కీలక పరిణామం.. మోహన్ లాల్ ప్రకటన

మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ ఏనుగు దంతాల కేసులో కీలక వివరాలను ప్రకటించారు. తన వద్ద 10 ఏనుగు దంతాలతో…

4 hours ago

రాత్రి తాగ‌డం.. పొద్దున్నే వాగ‌డం.. ప్రకాశ్‌ రాజ్‌పై బండ్ల గణేశ్ ఫైర్‌

రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోన్న యూట్యూబర్ 'ప్రశ్న రావణ్' అలియాస్ జోసెఫ్ బచ్చలకూరి జోసెఫ్ అరెస్ట్ వ్యవహారం ఇప్పుడు తెలుగు సినీ…

4 hours ago

నార్నే నితిన్ కొత్త సినిమా ప్రారంభం..

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ బావమరిది, యువ హీరో నార్నే నితిన్ ప్రేక్షకులను ఆలరించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు #NN5…

7 hours ago

అక్కినేని అఖిల్ కు కొత్త పేరు.? సెంటిమెంట్ కలిసొచ్చేనా?

టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని అఖిల్ తాజా చిత్రం 'లెనిన్'. పవర్‌ఫుల్ రా అండ్ రస్టిక్ హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామాగా…

8 hours ago