టాలీవుడ్ టాలెంటెడ్ యాక్టర్ అడివి శేష్ త్వరలోనే బాలీవుడ్ చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారని తెలుస్తోంది. కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలతో సౌత్‌లోనే కాకుండా నార్త్ ఆడియన్స్‌లోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్న శేష్, ఇప్పుడు నేరుగా ఒక హిందీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారని సమాచారం.
‘మేజర్’, ‘డెకాయిట్’ వంటి చిత్రాలతో విజయం అందుకున్న అడివి శేష్‌కు హిందీ బెల్ట్‌లోనూ బలమైన మార్కెట్ ఏర్పడింది కాగా, ఈ కొత్త హిందీ చిత్రంలో అడివి శేష్‌తో పాటు మరో ప్రముఖ హీరో, అలాగే ఒక స్టార్ హీరోయిన్ కీలక పాత్రల్లో నటించనున్నారు. సెప్టెంబర్ నెలలోనే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు, నటీనటుల ఎంపిక ప్రక్రియ పూర్తి కానుందని తెలుస్తోంది. భారీ యాక్షన్ డ్రామాగా రాబోతున్న ఈ చిత్రం అక్టోబర్ నుండి రెగ్యులర్ షూటింగ్‌కు వెళ్లనున్నట్లు సమాచారం.
అయితే, ప్రస్తుతానికి ఈ చిత్ర దర్శకుడు ఎవరు? సినిమా టైటిల్ ఏంటి? అనే విషయాలను మూవీ మేకర్స్ రహస్యంగా ఉంచారు. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే, శేష్ ప్రస్తుతం మోస్ట్ అవేటెడ్ సీక్వెల్ ‘గూఢచారి 2’ షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. వినయ్ కుమార్ సిరిగినీడి డైరెక్షన్ లో వస్తున్న ఈ యాక్షన్ స్పై థ్రిల్లర్‌లో బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ కీలక పాత్ర పోషిస్తున్నారు.
స్థానిక చట్టాలను ఉల్లంఘించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న 40 మంది విదేశీయుల అమెరికా పౌరసత్వాన్ని రద్దు చేసేందుకు అమెరికా ప్రభుత్వం చర్యలు…
ఫ్లైదుబాయ్ విమానంలో కోపైలట్ దాడిలో తీవ్రంగా గాయపడిన భారతీయ పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చర్ ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతున్నట్లు వైద్యులు…
అమెరికాలోని జార్జియా రాష్ట్రం ఆల్ఫారెట్టాలో మన అసోసియేషన్ ఆఫ్ అట్లాంటా (MAA) ఆధ్వర్యంలో మన బతుకమ్మ సెలబ్రేషన్స్ 2026 ఘనంగా…
కోపం మనిషిని ఎలా పతనం చేస్తుంది? | గీత 2.63 శ్లోకం #bhagavadgita #manatv #gita #bhagavadgitatelugu #geethaslokam #krishna…
తిరుమల సమాచారం Tirupati Balaji Latest Information 6-10-26 Tirumala Update #thirupathi #manatvlive తిరుమల సమాచారం Tirupati Balaji…
Gold Rate Today : 24K & 22K Prices Sep 6-10-26 #short #goldrate #24kgold #22kgold #goldprice…