Categories: NRI Updates

న్యూజెర్సీలో ఘనంగా TTA బతుకమ్మ వేడుకలు.. 3,000 మందికి పైగా హాజరు

న్యూజెర్సీ: అమెరికాలోని న్యూజెర్సీ రాష్ట్రం ఫోర్డ్స్‌లో ఉన్న రాయల్ ఆల్బర్ట్ ప్యాలెస్‌లో తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (TTA) ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలకు 3,000 మందికి పైగా హాజరై తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల వైభవాన్ని చాటిచెప్పారు.

టిటిఏ వ్యవస్థాపకుడు డాక్టర్ పైళ్ల మల్లారెడ్డి ఆశీస్సులతో, అడ్వైజరీ చైర్ డాక్టర్ విజయపాల్ రెడ్డి నాయకత్వంలో, గ్రాండ్ స్పాన్సర్ డాక్టర్ మోహన్ రెడ్డి పటలోళ్ల సహకారంతో ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది.

న్యూజెర్సీ టిటిఏ బృందం సభ్యులు శివ రెడ్డి కొల్ల (కార్యదర్శి), నరసింహ పెరుక (అంతర్జాతీయ ఉపాధ్యక్షుడు), సుధాకర్ ఉప్పల (న్యూస్‌లెటర్ డైరెక్టర్), అరుణ్ అర్కల (బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సభ్యుడు), నరేంద్ర యారవ (స్టాండింగ్ కమిటీ చైర్), దీపా జలగం (మహిళా విభాగం నాయకురాలు) తదితరులు వేడుకల నిర్వహణలో కీలక పాత్ర పోషించారు.

భారీ వర్షాలను సైతం లెక్కచేయకుండా మహిళలు, పురుషులు, చిన్నారులు సంప్రదాయ దుస్తుల్లో వేడుకలకు హాజరయ్యారు. రంగురంగుల పూలతో అలంకరించిన బతుకమ్మలతో ప్రాంగణమంతా పండుగ శోభను సంతరించుకుంది. తెలంగాణ జానపద సంస్కృతి, సంప్రదాయాల ప్రతిబింబంగా ఈ వేడుకలు సాగాయి.

వేడుకలను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ టిటిఏ బృందం కృతజ్ఞతలు తెలియజేసింది. విదేశాల్లో నివసిస్తున్న తెలుగు ప్రజల్లో సాంస్కృతిక అనుబంధాన్ని బలోపేతం చేయడంతో పాటు, తెలంగాణ సంప్రదాయాలను భావితరాలకు పరిచయం చేయడమే ఇలాంటి కార్యక్రమాల ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు పేర్కొన్నారు.

ManaTV Team

Recent Posts

లండన్‌లో అంగరంగ వైభవంగా బతుకమ్మ వేడుకలు.. ముఖ్య అతిథిగా ఎంపీ సీమా మల్హోత్రా

లండన్: యూకేలోని హౌన్స్లోలో గోల్డెన్ స్కై ఈవెంట్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ సంబరాలు 2026 ఘనంగా జరిగాయి. అక్టోబర్ 10న…

11 hours ago

న్యూజెర్సీలో ఘనంగా TDF బతుకమ్మ వేడుకలు

అమెరికాలోని న్యూజెర్సీ రాష్ట్రం మోన్రోలో తెలంగాణ డెవలప్‌మెంట్ ఫోరం (TDF) ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో…

17 hours ago

WETA ఆధ్వర్యంలో శాన్ రామన్‌లో బతుకమ్మ, దసరా వేడుకలు

అమెరికాలో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల వైభవాన్ని చాటిచెప్పేందుకు ఉమెన్ ఎంపవర్‌మెంట్ తెలుగు అసోసియేషన్ (WETA) ఆధ్వర్యంలో బతుకమ్మ, దసరా వేడుకలను…

17 hours ago

TTA Bathukamma Celebrations | A Spectacular Cultural Event #bathukamma #tta #manatv

TTA Bathukamma Celebrations | A Spectacular Cultural Event #bathukamma #tta #manatv #bathukamma #tta #bathukammacelebrations #telangana…

18 hours ago

తిరుమల సమాచారం Tirupati Balaji Latest Information 15-10-26 Tirumala Update #thirupathi #manatvlive

తిరుమల సమాచారం Tirupati Balaji Latest Information 15-10-26 Tirumala Update #thirupathi #manatvlive Tirumala Update #thirupathi #manatvlive…

23 hours ago