హోంగార్డుల కుటుంబాలకు రూ.38 లక్షల చొప్పున ప్రమాద బీమా చెక్కుల అందజేత
విధి నిర్వహణలో ఉంటూ ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయిన ఇద్దరు హోంగార్డుల కుటుంబ సభ్యులకు ఒక్కొక్కరికి రూ.38 లక్షల చొప్పున ప్రమాద బీమా చెక్కులను హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనర్ అందజేశారు. బషీర్‌బాగ్‌లోని సీపీ కార్యాలయంలో శుక్రవారం ఆయన ఈ చెక్కులను బాధిత కుటుంబాలకు అందించారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్న హోంగార్డులు సయ్యద్ హుస్సేన్, సింహగిరి ఇటీవల వేర్వేరు ప్రమాదాల్లో మరణించారు. సయ్యద్ హుస్సేన్ నీటిలో మునిగి చనిపోగా.. సింహగిరి రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. హోంగార్డుల వేతన ఖాతాలకు ప్రమాద బీమా కవరేజీ ఉండటంతో.. యాక్సిస్ బ్యాంక్ వారికి ప్రమాద బీమాను మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో బ్యాంక్, పోలీస్ అధికారులతో కలిసి రూ.38 లక్షల చొప్పున చెక్కులను సయ్యద్ హుస్సేన్ భార్య రేష్మా బేగం, సింహగిరి భార్య భవానీకి సీపీ సజ్జనర్ అందజేశారు.
Mohan Vadlapatla Honoured as Best Debut Director, While Jo Sharma Receives Best Debut Heroine Award…
తిరుమల సమాచారం Tirupati Balaji Latest Information 10-10-26 Tirumala Update #thirupathi #manatvlive తిరుమల సమాచారం Tirupati Balaji…
Gold Rate Today : 24K & 22K Prices Sep 10-10-26 #short #goldrate #24kgold #22kgold #goldprice#manatv…
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (NATS) ఆధ్వర్యంలో మిషిగన్ చాప్టర్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని అక్టోబర్ 11, 2026న నిర్వహించనున్నారు. ఉత్తర…
కృత్రిమ మేధస్సు (AI) పేరును ‘సూపర్ ఇంటెలిజెన్స్’ (SI)గా మార్చాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సూచించినట్లు వార్తలు వెలువడ్డాయి.…
భారత పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు ఇజ్రాయెల్ ప్రభుత్వం ‘ప్రెసిడెన్షియల్ అవార్డ్ ఫర్ సివిలియన్ హీరోయిజం’ పురస్కారాన్ని ప్రకటించినట్లు సమాచారం.…