Find Articles

హోంగార్డుల కుటుంబాలకు అండగా ప్రభుత్వం, పోలీస్ శాఖ.. రూ.38 లక్షల చొప్పున ప్రమాద బీమా చెక్కులను అందజేసిన హైదరాబాద్ సీపీ

హోంగార్డుల కుటుంబాలకు అండగా ప్రభుత్వం, పోలీస్ శాఖ.. రూ.38 లక్షల చొప్పున ప్రమాద బీమా చెక్కులను అందజేసిన హైదరాబాద్ సీపీ

హోంగార్డుల కుటుంబాలకు రూ.38 లక్షల చొప్పున ప్రమాద బీమా చెక్కుల అందజేత

విధి నిర్వహణలో ఉంటూ ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయిన ఇద్దరు హోంగార్డుల కుటుంబ సభ్యులకు ఒక్కొక్కరికి రూ.38 లక్షల చొప్పున ప్రమాద బీమా చెక్కులను హైదరాబాద్‌ సీపీ వీసీ సజ్జనర్ అందజేశారు. బషీర్‌బాగ్‌లోని సీపీ కార్యాలయంలో శుక్రవారం ఆయన ఈ చెక్కులను బాధిత కుటుంబాలకు అందించారు. హైదరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో పనిచేస్తున్న హోంగార్డులు సయ్యద్‌ హుస్సేన్, సింహగిరి ఇటీవల వేర్వేరు ప్రమాదాల్లో మరణించారు. సయ్యద్‌ హుస్సేన్ నీటిలో మునిగి చనిపోగా.. సింహగిరి రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. హోంగార్డుల వేతన ఖాతాలకు ప్రమాద బీమా కవరేజీ ఉండటంతో.. యాక్సిస్‌ బ్యాంక్‌ వారికి ప్రమాద బీమాను మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో బ్యాంక్, పోలీస్ అధికారులతో కలిసి రూ.38 లక్షల చొప్పున చెక్కులను సయ్యద్‌ హుస్సేన్ భార్య రేష్మా బేగం, సింహగిరి భార్య భవానీకి సీపీ సజ్జనర్ అందజేశారు.

 

ManaTV Team