అమెరికా తెలుగు సంఘం (ఆటా) ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 19వ మహాసభలు మరియు యువజన సదస్సులో మహిళల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఉమెన్స్ ఫోరం ఈసారి ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. జూలై 31 నుంచి ఆగస్టు 2 వరకు మేరీల్యాండ్‌లోని బాల్టిమోర్ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగే మహాసభల్లో రెండు రోజుల పాటు మహిళల వ్యక్తిత్వ వికాసం, సాంకేతిక పరిజ్ఞానం, ఆర్థిక సాధికారత, ఆరోగ్యం వంటి అంశాలపై వైవిధ్యభరితమైన కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
ఉమెన్స్ ఫోరం చైర్ సమిత లక్ష్మి నెరవెట్ల తెలిపిన వివరాల ప్రకారం, ఫోరం ఆధ్వర్యంలో నిర్వహించే ‘మీట్ అండ్ గ్రీట్’ కార్యక్రమానికి మేరీల్యాండ్ లెఫ్టినెంట్ గవర్నర్ అరుణా మిల్లర్, వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్ ఘజాలా హష్మీ ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. ఈ కార్యక్రమానికి డాక్టర్ ప్రశాంతి బి. మైనంపల్లి, శ్రుతి బోయినపల్లి మోడరేటర్లుగా వ్యవహరించనున్నారు. అలాగే సినీ నటి పూజా హెగ్డే, రీతూ వర్మ, యాంకర్ శ్రీముఖి, దివి వాద్య, అనన్య నాగళ్లతో పాటు వైద్య, వ్యాపార, సామాజిక రంగాలకు చెందిన పలువురు ప్రముఖ మహిళలు ఈ ఫోరంలో పాల్గొననున్నారు.
తొలి రోజు: ‘లెవల్ అప్ యువర్ హసిల్’
ఆగస్టు 1న మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు జరిగే తొలి రోజు కార్యక్రమాల్లో టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై ప్రత్యేక చర్చలు నిర్వహించనున్నారు. “కెన్ క్లాడ్ ఏఐ ప్రిపేర్ యువర్ చాయ్?” అనే అంశంపై ఆసక్తికరమైన సెషన్‌తో పాటు, మహిళల దైనందిన జీవితంలో ఏఐ వినియోగంపై అవగాహన కల్పించనున్నారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ‘ఏఐ అండ్ చాయ్’ అనుభవ కేంద్రంలో సందర్శకులు పాల్గొనే అవకాశం ఉంటుంది.
అదే రోజు ‘పేరెంటింగ్ ఇన్ టుడేస్ వరల్డ్’ అంశంపై డిజిటల్ యుగంలో పిల్లలను ఆత్మవిశ్వాసంతో, బాధ్యతాయుతంగా ఎలా తీర్చిదిద్దాలనే అంశాలపై నిపుణులు ఆచరణాత్మక సూచనలు అందించనున్నారు.
రెండో రోజు: ‘బాస్ హర్ అప్’
ఆగస్టు 2న మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు జరిగే రెండో రోజు కార్యక్రమాలు మహిళల ఆర్థిక, వ్యక్తిగత అభివృద్ధికి అంకితం కానున్నాయి. ఆర్థిక సాధికారత, స్మార్ట్ ఇన్వెస్ట్‌మెంట్ వ్యూహాలు, దీర్ఘకాలిక ఆర్థిక ప్రణాళికపై నిపుణులు మార్గనిర్దేశం చేయనున్నారు.
అదే సమయంలో వివిధ రంగాల్లో రాణిస్తున్న మహిళా వ్యాపారవేత్తలు, నిపుణులతో నెట్‌వర్కింగ్ అవకాశాలు కల్పించనున్నారు. మహిళల ఆరోగ్యం, హెల్తీ ఏజింగ్, సరైన పోషకాహారం, బరువు నియంత్రణ, మానసిక-శారీరక సమతుల్యత, స్వీయ సంరక్షణ వంటి అంశాలపై ప్రత్యేక సెషన్లు నిర్వహించనున్నారు.
ఉమెన్స్ ఫోరం కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు కో-చైర్లు లక్ష్మి పురుషోత్తమన్, శ్రుతి బోయినపల్లి, ప్రశాంతి మైనంపల్లి, సభ్యులు సునీత యలమంచి, శివాని బొరెడ్డి, రమా చల్లా, సలహాదారు కవితా చల్లా, ఆటా కార్యవర్గ సభ్యులు సమన్వయంతో ఏర్పాట్లు చేస్తున్నారు. కార్యక్రమాలకు హాజరయ్యే మహిళలకు ప్రత్యేక గిఫ్ట్‌లను కూడా అందించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
Don’t wait until you see the SOLD OUT announcement! Book your tickets now and join…
Saraswathi Puja – Devi Navaratri Celebrations Hindu Temple of Atlanta invites all devotees to participate…
We are hosting FREE GENAI TRAINING for everyone. Nov 7th – Nov 29th, 2026 100%…
అమెరికాలోని న్యూజెర్సీలో న్యూజెర్సీ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో 17వ వార్షిక బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను…
The Indian Culture Society of NJ (ICS of NJ) is organizing a grand Navratri Celebration…
ప్రజల ఆశీర్వాదమే తనను ముందుకు నడిపించిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ప్రజలకు సేవ చేసేందుకు భగవంతుడు తనకు శక్తిని…