స్టార్ నటి, మాజీ మంత్రి రోజా సెల్వమణి కుటుంబంలో పండుగ వాతావరణం నెలకొంది. ఆమె కుమార్తె అన్షు మాలిక సెల్వమణి అరుదైన రికార్డ్ సాధించారు. దీంతో వారి కుటుంబంలో ఆనందానికి అవధులు లేకుండాపోయాయి.
భారత్ లో ఇప్పటివరకూ ఎవరు సాధించలేని అరుదైన అవార్డును అన్షు మాలిక గెలుచుకున్నారు. ఇండియానా యూనివర్సిటీలో అత్యంత ప్రెస్టేజియస్ గా భావించే “హెర్మన్ బి వెల్స్ డిస్టింగ్విష్డ్ సీనియర్ అవార్డు” అందుకున్న తొలి భారతీయ విద్యార్థినిగా ఆమె గుర్తింపు పొందింది. అన్షు మాలిక ప్రస్తుతం అమెరికాలోని ఇండియానా యూనివర్సిటీలో లడ్డి స్కూల్ ఆఫ్ ఇన్ఫర్మాటిక్స్, కంప్యూటింగ్ అండ్ ఇంజినీరింగ్‌లో కంప్యూటర్ సైన్స్‌లో చదువుతున్నారు. ఓ వైపు చదువులో రాణిస్తూనే, మరోవైపు లీడర్షిప్ క్వాలిటీస్ చూపించిన బెస్ట్ స్టూడెంట్ గా ఈ అవార్డును అందుకున్నారు.
అన్షు మాలిక ఇది మాత్రమే కాదు.. చాలా ఘనతలను సాధించారు. చదువుకుంటూనే పలు ప్రెస్టేజియస్ అవార్డులను కూడా అందుకున్నారు. మౌరీన్ బిగ్గర్స్ లీడర్‌షిప్ అవార్డు ఫర్ ఈక్విటీ అండ్ టెక్నాలజీ, లడ్డి అకాడెమిక్ ఎక్సలెన్స్ అవార్డు, డీన్ లిస్ట్ గుర్తింపులు, ఫౌండర్స్ స్కాలర్ వంటి అనేక గౌరవాలు ఆమె ఖాతాలో ఉండగా.. వాటితో పాటు గ్లోబల్ ఎంట్రప్రెన్యూర్ అవార్డు 2024, గ్లోబల్ ఇంపాక్ట్ అడ్వకేట్ అవార్డు 2025 వంటి గుర్తింపులు కూడా ఆమె సాధించారు.
స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ పెళ్లి, మాతృత్వం తర్వాత కూడా తన సినీ ప్రయాణాన్ని విజయవంతంగా కొనసాగిస్తున్నారు.ప్రస్తుతం 'ది ఇండియా…
తమిళనాడు సీఎం, దళపతి విజయ్ నటించిన చివరి చిత్రం ‘జన నాయగన్’. ఈ చిత్రం సెన్సార్ ప్రక్రియ పూర్తయి ‘ఏ’…
మెగాస్టార్ చిరంజీవి, బాబీ కాంబినేషన్ లో రాబోతున్న చిత్రం 'మెగా158' (వర్కింగ్ టైటిల్).జూన్ 22న హైదరాబాద్‌లో రెండో షెడ్యూల్ షూటింగ్…
టాలీవుట్ స్టార్ హీరోలు విక్టరీ వెంకటేశ్, నందమూరి కల్యాణ్‌రామ్ కలిసి నటిస్తున్న కొత్త సినిమా షూటింగ్ జెట్ స్పీడ్ లో…
టాలీవుడ్ యంగ్ హీరో అఖిల్ అక్కినేని నటిస్తున్న లేటెస్ట్ మాస్ అండ్ యాక్షన్ మూవీ ‘లెనిన్’. తాజాగా ఈ చిత్రానికి…
పూణె వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ హత్య కేసులో నిందితురాలైన సియా గోయల్ చర్యలను సమర్థించేలా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన…