స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ పెళ్లి, మాతృత్వం తర్వాత కూడా తన సినీ ప్రయాణాన్ని విజయవంతంగా కొనసాగిస్తున్నారు.ప్రస్తుతం ‘ది ఇండియా స్టోరీ’తో పాటు ప్రతిష్ఠాత్మక పాన్ ఇండియా చిత్రం ‘రామాయణ’ షూటింగ్‌లతో బిజీగా ఉన్నారు.అయితే తాజాగా ఓ సందర్భంలో కాజల్ తాను తల్లి అయిన తర్వాత సినిమాల ఎంపికలో తన ఆలోచనా విధానం పూర్తిగా మారిపోయిందని తెలిపారు.తన కొడుకు నీల్ పెద్దయ్యాక తన సినిమాలు చూసి గర్వంగా చెప్పుకునేలా ఉండే స్క్రిప్ట్‌లను ఎంచుకుంటున్నట్లు చెప్పారు. అందుకే కమర్షియల్ అంశాల కంటే బలమైన పాత్రలు, సందేశాత్మక చిత్రాలకే ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు.
డైరెక్టర్ చేతన్ డీకే రూపొందిస్తున్న ‘ది ఇండియా స్టోరీ’లో కాజల్ పవర్‌ఫుల్ లాయర్ పాత్రలో కనిపించనున్నారు. శ్రేయస్ తల్పడే కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రం జూలై 24న విడుదల కానుంది. కల్తీ ఆహారం, పురుగుమందుల ప్రభావం నేపథ్యంలో ఈ సినిమా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే ఒక తల్లిగా తన ఇంట్లో వాడే ఆహార పదార్థాల విషయంలో మరింత జాగ్రత్తలు తీసుకోవడం ప్రారంభించానని కాజల్ తెలిపారు. మరోవైపు, నితేష్ తివారీ దర్శకత్వంలో రణ్‌బీర్ కపూర్, సాయిపల్లవి, యశ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న ‘రామాయణ’లో కాజల్ మండోదరి పాత్ర పోషిస్తున్నారు.ఈ సినిమా రెండో భాగం విడుదలయ్యే సమయానికి నీల్‌కు ఐదేళ్లు వస్తాయన్న కాజల్ అగర్వాల్, థియేటర్‌లో తన కొడుకు చూసే మొదటి సినిమా ఇదే అవుతుందని ఆనందం వ్యక్తం చేశారు.
పట్నా నుంచి లఖ్‌నవూకు వెళ్తున్న ఇండిగో విమానాన్ని 17 వేల అడుగుల ఎత్తులో పిడుగు తాకింది. దీంతో విమానం ముందు…
యెమెన్‌కు చెందిన హూతీ తిరుగుబాటుదారులు సౌదీ అరేబియాలోని పౌర విమానాశ్రయాలపై క్షిపణులు, డ్రోన్లతో దాడులకు పాల్పడిన నేపథ్యంలో.. సౌదీ నాయకత్వంలోని…
ఫ్రాన్స్‌లో పాఠశాలల్లో మెరుగైన వసతులు కల్పించడంతో పాటు, ఉపాధ్యాయుల నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు ఆందోళనలకు దిగారు. 15…
ప్రశాంతమైన మనస్సుతోనే నిజమైన శాంతి | భగవద్గీత 2.65 #bhagavadgita #manatv #bhagavadgita #gita #gitasloka #krishna #lordkrishna #spirituality…
తిరుమల సమాచారం Tirupati Balaji Latest Information 8-10-26 Tirumala Update #thirupathi #manatvlive తిరుమల సమాచారం Tirupati Balaji…
Gold Rate Today : 24K & 22K Prices Sep 8-10-26 #short #goldrate #24kgold #22kgold #goldprice#manatv…