మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ ‘పెద్ది’ ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. దర్శకుడు బుచ్చిబాబు సాన తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ‘ఉప్పెన’ తర్వాత బుచ్చిబాబు రూపొందిస్తున్న సినిమా కావడంతో పాటు రామ్ చరణ్ పూర్తిగా మాస్ అవతార్‌లో కనిపించబోతున్నారు. అయితే తాజాగా ఓవర్సీస్ ప్రీ-సేల్స్‌లో ‘పెద్ది’ సంచలనం సృష్టించింది.
జూన్ 4న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానున్న ఈ సినిమా.. అమెరికాలో మాత్రం జూన్ 3 నుంచి ప్రీమియర్లతో సందడి చేయడానికి రెడీ అయింది. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానున్న ఈ మూవీకి భారీ డిమాండ్ ఏర్పడింది. ఈ క్రమంలో ఇప్పటికే ఓవర్ సీస్ లో అడ్వాన్స్ బుకింగ్స్ జోరుగా సాగుతున్నాయి. టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి.
‘పెద్ది’ చిత్రాన్ని ప్రత్యంగిర సినిమాస్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఓవర్ సీస్ లో రిలీజ్ చేస్తోంది. నార్త్ అమెరికాలో టికెట్ బుకింగ్స్ తెరుచుకున్న కొన్ని గంటల్లోనే ప్రీసేల్స్ లక్ష డాలర్ల మార్క్ దాటేసింది. ఇది తెలుగు సినిమాల్లో ఆల్ టైమ్ రికార్డ్ అని చెప్పాలి. ఇప్పటికే ఉత్తర అమెరికా ప్రీమియర్లకు 5000+ టికెట్లు అమ్ముడయ్యాయని, ఇంకా పెరుగుతూనే ఉన్నాయని మూవీ యూనిట్ అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. అంతేకాదు ఇది కేవలం ఆరంభం మాత్రమేనని చెప్పింది.
ఇదిలా ఉండగా..తాజాగా మరో వివాదం తెరపైకి వచ్చింది. అదే యూఎస్ టికెట్ రేట్లు. కొన్ని థియేటర్లలో ‘పెద్ది’ ప్రీమియర్ టికెట్ ధర 38 డాలర్లుగా ఉండగా.. ట్యాక్స్, ఆన్‌లైన్ బుకింగ్ ఛార్జీలు కలిపితే 40 డాలర్ల నుంచి 42 డాలర్ల వరకు వెళ్తుందని తెలుస్తోంది. దీంతో సోషల్ మీడియాలో పెద్ద చర్చ మొదలైంది. ఈ క్రమంలోనే ఓ తెలుగు సినీ అభిమాని చేసిన వీడియో వైరల్ గా మారింది. ఇది RRRనా? లేక బాహుబలి 2 నా? పెద్ది సినిమాకు 40 డాలర్లా అంటూ ప్రశ్నించారు.
స్థానిక చట్టాలను ఉల్లంఘించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న 40 మంది విదేశీయుల అమెరికా పౌరసత్వాన్ని రద్దు చేసేందుకు అమెరికా ప్రభుత్వం చర్యలు…
ఫ్లైదుబాయ్ విమానంలో కోపైలట్ దాడిలో తీవ్రంగా గాయపడిన భారతీయ పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చర్ ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతున్నట్లు వైద్యులు…
అమెరికాలోని జార్జియా రాష్ట్రం ఆల్ఫారెట్టాలో మన అసోసియేషన్ ఆఫ్ అట్లాంటా (MAA) ఆధ్వర్యంలో మన బతుకమ్మ సెలబ్రేషన్స్ 2026 ఘనంగా…
కోపం మనిషిని ఎలా పతనం చేస్తుంది? | గీత 2.63 శ్లోకం #bhagavadgita #manatv #gita #bhagavadgitatelugu #geethaslokam #krishna…
తిరుమల సమాచారం Tirupati Balaji Latest Information 6-10-26 Tirumala Update #thirupathi #manatvlive తిరుమల సమాచారం Tirupati Balaji…
Gold Rate Today : 24K & 22K Prices Sep 6-10-26 #short #goldrate #24kgold #22kgold #goldprice…