తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ మాజీ చైర్‌పర్సన్ గద్వాల్ విజయలక్ష్మిని రాష్ట్ర ప్రణాళికా బోర్డు వైస్ చైర్మన్‌గా నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజూ పేరుతో సెప్టెంబర్ 3, 2026న అధికారిక ఉత్తర్వులు జారీ అయ్యాయి.
ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం.. గద్వాల్ విజయలక్ష్మికి కేబినెట్ మంత్రి హోదా కల్పిస్తూ ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్‌గా నియమించారు. ఈ నియామకం తక్షణమే అమల్లోకి వస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ఇంతకుముందు తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా బాధ్యతలు నిర్వహించిన విజయలక్ష్మికి తాజాగా మరో కీలక బాధ్యత అప్పగించారు. రాష్ట్ర ప్రణాళికా వ్యవహారాల్లో కీలకమైన ప్రణాళికా బోర్డు వైస్ చైర్మన్‌గా ఆమె నియామకం ప్రాధాన్యత సంతరించుకుంది.