Find Articles

యేషనాగుల’ సాంగ్ సరికొత్త రికార్డు.. 5 రోజుల్లోనే 50 మిలియన్ల వ్యూస్

యేషనాగుల’ సాంగ్ సరికొత్త రికార్డు.. 5 రోజుల్లోనే 50 మిలియన్ల వ్యూస్

టాలీవుడ్‌లో ‘ది ప్యారడైజ్’ మూవీ నుంచి విడుదలైన ‘యేషనాగుల’ పాట దూసుకెళ్తోంది. విడుదలైన కేవలం ఐదు రోజుల్లోనే 50 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి సరికొత్త రికార్డు నెలకొల్పింది.

తెలుగు పాటల్లో ఇంత వేగంగా 50 మిలియన్ల వ్యూస్ మార్క్‌ను అందుకున్న పాటగా ‘యేషనాగుల’ నిలిచింది. అదిరిపోయే మాస్ బీట్స్, హై ఎనర్జీతో ఈ సాంగ్ తెలుగు ప్రేక్షకులతో పాటు దేశ విదేశాల్లోని మ్యూజిక్ లవర్స్‌ను కూడా ఆకట్టుకుంటోంది.

ఇక ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ షార్ట్స్‌లో ‘యేషనాగుల’ పాటకు సంబంధించిన వీడియోలు వైరల్‌గా మారుతున్నాయి. దీంతో ఈ సాంగ్ కేవలం సినిమా పాటగానే కాకుండా గ్లోబల్ మాస్ మ్యూజిక్ ట్రెండ్‌గా మారుతోంది.

ఇదే జోరు కొనసాగితే రాబోయే రోజుల్లో ‘యేషనాగుల’ మరిన్ని రికార్డులను బద్దలు కొట్టే అవకాశం ఉంది

ManaTV Team