Categories: Movie News

తగ్గేదేలే.. మెగాస్టార్ సరికొత్త లుక్!!

– జెన్-జీ ఫ్యాషన్‌తో మెస్మరైజ్ చేసిన చిరు
– మెగా యంగ్ లుక్ కు అభిమానులు ఫిదా

మెగాస్టార్ చిరంజీవి సరికొత్త లుక్ తో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. స్లిమ్ అండ్ ఎనర్జిటిక్ లుక్ తో కనిపిస్తున్న ఆయన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ప్రస్తుత తరం ఫ్యాషన్‌కు ఏమాత్రం తీసిపోని విధంగా, జెన్-జీ ఫ్యాషన్ తో చిరంజీవి మెస్మరైజ్ చేస్తున్నారు. ఆయన స్టైల్ ఎప్పటికీ ప్రత్యేకమేనని నిరూపిస్తున్నారు. కఠినమైన క్రమశిక్షణ, నిరంతర శ్రమతో ఆయన తన ఫిట్‌నెస్‌ను ఎలా కాపాడుకుంటున్నారో ఈ లుక్ స్పష్టం చేస్తోంది. ఆయనలోని ఆకర్షణ ఏమాత్రం తగ్గలేదని, యంగ్‌ హీరోలకు ధీటుగా తన లుక్‌తో అభిమానులను ఫిదా చేస్తున్నారని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.

మరోవైపు తన నెక్ట్స్ సినిమా కోసం చిరంజీవి రెడీ అవుతున్నారు. త్వరలోనే దర్శకుడు బాబీ కొల్లితో చేయబోతున్న కొత్త సినిమా షూటింగ్‌లో పాల్గొననున్నారు. ఈ చిత్రాన్ని కేవీఎన్ ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. అయితే, ప్రస్తుతం కనిపిస్తున్న స్టైలిష్ లుక్ చిరంజీవి వ్యక్తిగత స్టైల్ మాత్రమేనని, రాబోయే సినిమాలోని పాత్రకు సంబంధించినది కాదని తెలుస్తోంది. మూవీకి సంబంధించిన అధికారిక లుక్ ను చిత్రయూనిట్ విడుదల చేస్తోంది. మొత్తంగా చిరు ఫొటోలు నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి.

ManaTV Team

Recent Posts

7 వేల అడుగుల ఎత్తులో ఇండిగో విమానానికి పిడుగు.. సేఫ్‌గా ల్యాండింగ్

పట్నా నుంచి లఖ్‌నవూకు వెళ్తున్న ఇండిగో విమానాన్ని 17 వేల అడుగుల ఎత్తులో పిడుగు తాకింది. దీంతో విమానం ముందు…

22 minutes ago

హూతీ స్థావరాలపై సౌదీ కూటమి భారీ దాడులు

యెమెన్‌కు చెందిన హూతీ తిరుగుబాటుదారులు సౌదీ అరేబియాలోని పౌర విమానాశ్రయాలపై క్షిపణులు, డ్రోన్లతో దాడులకు పాల్పడిన నేపథ్యంలో.. సౌదీ నాయకత్వంలోని…

27 minutes ago

ఫ్రాన్స్‌లో విద్యార్థుల నిరసనలు తీవ్రం

ఫ్రాన్స్‌లో పాఠశాలల్లో మెరుగైన వసతులు కల్పించడంతో పాటు, ఉపాధ్యాయుల నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు ఆందోళనలకు దిగారు. 15…

34 minutes ago

ప్రశాంతమైన మనస్సుతోనే నిజమైన శాంతి | భగవద్గీత 2.65 #bhagavadgita #manatv

ప్రశాంతమైన మనస్సుతోనే నిజమైన శాంతి | భగవద్గీత 2.65 #bhagavadgita #manatv #bhagavadgita #gita #gitasloka #krishna #lordkrishna #spirituality…

8 hours ago

తిరుమల సమాచారం Tirupati Balaji Latest Information 8-10-26 Tirumala Update #thirupathi #manatvlive

తిరుమల సమాచారం Tirupati Balaji Latest Information 8-10-26 Tirumala Update #thirupathi #manatvlive తిరుమల సమాచారం Tirupati Balaji…

8 hours ago

Gold Rate Today : 24K & 22K Prices Sep 8-10-26 #short #goldrate #24kgold #22kgold #goldprice#manatv

Gold Rate Today : 24K & 22K Prices Sep 8-10-26 #short #goldrate #24kgold #22kgold #goldprice#manatv…

8 hours ago