– విజయ్ ప్రభుత్వానికి కాంగ్రెస్, వామపక్షాలు, వీసీకే పార్టీల సంపూర్ణ మద్దతు
– అన్నాడీఎంకే రెబల్ ఎమ్మెల్యేల సపోర్ట్ తో బలపడిన టీవీకే కూటమి
తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. సీఎం విజయ్ నేతృత్వంలోని కొత్త ప్రభుత్వం శాసనసభలో విశ్వాస పరీక్షను ఎదుర్కొంది. ఎన్నో నాటకీయ రాజకీయ పరిణామాల మధ్య జరిగిన ఈ బలపరీక్ష, అన్నాడీఎంకేలో విభేదాలను బహిర్గతం చేసింది.
విజయ్ తీర్మానం ప్రవేశపెట్టిన వెంటనే కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి తమ మద్దతును అధికారికంగా ప్రకటించారు. అలాగే విదుతలై చిరుతైగల్ కట్చి పార్టీ కూడా విశ్వాస తీర్మానానికి మద్దతు పలికింది. అంతేకాదు అనూహ్యంగా అన్నాడీఎంకేకు చెందిన సీనియర్ నేతలు షణ్ముగం, వేలుమణి నేతృత్వంలోని రెబల్ ఎమ్మెల్యేల వర్గం కూడా విజయ్ ప్రభుత్వానికే మద్దతు ప్రకటించింది. అసెంబ్లీ ఎన్నికలలో పరాజయం తర్వాత నాయకత్వ సంక్షోభంలో ఉన్న అన్నాడీఎంకేలో అంతర్గత కలహాలు ఎక్కువ అయ్యాయని ఈ పరిణామంతో స్పష్టమైంది.
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 234 స్థానాలున్న సభలో విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కజగం అతిపెద్ద పార్టీగా అవతరించింది. కానీ, మెజారిటీ మార్కును అందుకోలేకపోయింది. దీంతో కాంగ్రెస్, వామపక్షాలు, వీసీకే మద్దతుతో టీవీకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలోనే తన బలాన్ని నిరూపించుకోవడానికి అసెంబ్లీలో విశ్వాస పరీక్షను ఎదుర్కొంది.
స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ పెళ్లి, మాతృత్వం తర్వాత కూడా తన సినీ ప్రయాణాన్ని విజయవంతంగా కొనసాగిస్తున్నారు.ప్రస్తుతం 'ది ఇండియా…
తమిళనాడు సీఎం, దళపతి విజయ్ నటించిన చివరి చిత్రం ‘జన నాయగన్’. ఈ చిత్రం సెన్సార్ ప్రక్రియ పూర్తయి ‘ఏ’…
మెగాస్టార్ చిరంజీవి, బాబీ కాంబినేషన్ లో రాబోతున్న చిత్రం 'మెగా158' (వర్కింగ్ టైటిల్).జూన్ 22న హైదరాబాద్‌లో రెండో షెడ్యూల్ షూటింగ్…
టాలీవుట్ స్టార్ హీరోలు విక్టరీ వెంకటేశ్, నందమూరి కల్యాణ్‌రామ్ కలిసి నటిస్తున్న కొత్త సినిమా షూటింగ్ జెట్ స్పీడ్ లో…
టాలీవుడ్ యంగ్ హీరో అఖిల్ అక్కినేని నటిస్తున్న లేటెస్ట్ మాస్ అండ్ యాక్షన్ మూవీ ‘లెనిన్’. తాజాగా ఈ చిత్రానికి…
పూణె వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ హత్య కేసులో నిందితురాలైన సియా గోయల్ చర్యలను సమర్థించేలా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన…