తెలంగాణలో పర్యాటక రంగం కొత్త పుంతలు తొక్కుతుంది. రాష్ట్రంలోనే తొలిసారిగా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో గ్లాస్ బ్రిడ్జి రూపుదిద్దుకుంటోంది.
కాకతీయుల కాలం నాటి చారిత్రక ఎల్లమ్మ చెరువులో గాజువంతెనను నిర్మిస్తుండటం విశేషం. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యేక చొరవతో చెరువు సుందరీకరణ పనుల్లో భాగంగా ఈ బ్రిడ్జ్ ను ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం రూ.4.22 కోట్ల వ్యయంతో, 150 మీటర్ల పొడవు, 5 అడుగుల వెడల్పుతో లేటెస్ట్ టెక్నాలజీ ఉపయోగించి నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టు కేవలం గ్లాస్ బ్రిడ్జికే పరిమితం కాకుండా, చెరువు పరిసరాలను పూర్తిస్థాయి వినోద కేంద్రంగా తీర్చిదిద్దుతున్నారు. ఇక్కడ బతుకమ్మ ఘాట్, వాకింగ్ ట్రాక్, గార్డెన్లు, ప్రత్యేక లైటింగ్, సెల్ఫీ పాయింట్లను కూడా అభివృద్ధి చేస్తుండటం విశేషం.
మరో రెండు, మూడు నెలల్లో ఈ గ్లాస్ బ్రిడ్జ్ ప్రజలకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని మున్సిపల్ అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలోనే తొలి గాజు వంతెన కావడంతో నిర్మాణం జరుగుతుండగానే స్థానికులు, పర్యాటకులు దీన్ని చూసేందుకు ఆసక్తి చూపుతున్నారు.
స్థానిక చట్టాలను ఉల్లంఘించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న 40 మంది విదేశీయుల అమెరికా పౌరసత్వాన్ని రద్దు చేసేందుకు అమెరికా ప్రభుత్వం చర్యలు…
ఫ్లైదుబాయ్ విమానంలో కోపైలట్ దాడిలో తీవ్రంగా గాయపడిన భారతీయ పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చర్ ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతున్నట్లు వైద్యులు…
అమెరికాలోని జార్జియా రాష్ట్రం ఆల్ఫారెట్టాలో మన అసోసియేషన్ ఆఫ్ అట్లాంటా (MAA) ఆధ్వర్యంలో మన బతుకమ్మ సెలబ్రేషన్స్ 2026 ఘనంగా…
కోపం మనిషిని ఎలా పతనం చేస్తుంది? | గీత 2.63 శ్లోకం #bhagavadgita #manatv #gita #bhagavadgitatelugu #geethaslokam #krishna…
తిరుమల సమాచారం Tirupati Balaji Latest Information 6-10-26 Tirumala Update #thirupathi #manatvlive తిరుమల సమాచారం Tirupati Balaji…
Gold Rate Today : 24K & 22K Prices Sep 6-10-26 #short #goldrate #24kgold #22kgold #goldprice…