Categories: India News

పాకిస్తాన్ ఉగ్రవాదంపై ‘జీరో టాలరెన్స్’.!

– అంతర్జాతీయ శాంతి, సమగ్రతకు టెర్రరిజంతో పెను ముప్పు
– ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో తక్షణ సంస్కరణలు అవసరం

ఉగ్రవాదంపై ‘జీరో టాలరెన్స్’ పాటించాలని భారత విదేశాంగ మంత్రి జైశంకర్ పిలుపునిచ్చారు. ఉగ్రవాదాన్ని రూపుమాపేందుకు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో తక్షణ సంస్కరణలు అవసరం అని తెలిపారు. ఢిల్లీలోని భారత్ మండపంలో జరిగిన బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశంలో పాల్గొన్న ఆయన ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న సమస్యలు, వివాదాలపై స్పందించారు.

అంతర్జాతీయ శాంతి, సమగ్రతకు టెర్రరిజంతో పెను ముప్పు పొంచి ఉందని విదేశాంగమంత్రి జైశంకర్ స్పష్టం తెలిపారు. సరిహద్దుల్లో పాక్ ప్రేరేపిత ఉగ్రవాద కార్యకలాపాల వల్ల దేశాల మధ్య సంబంధాలు మరింతగా క్షీణిస్తున్నాయని పేర్కొన్నారు. ఈ సందర్భంలోనే ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా వదిలే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఉగ్రవాదంపై జీరో టాలరెన్స్ అనేది ప్రపంచవ్యాప్తంగా రాజీలేని నియమంగా ఉండాలని స్పష్టం చేశారు. లేకపోతే అది భారీ మూల్యానికి దారి తీస్తుందని హెచ్చరించారు.

గతేడాది ఏప్రిల్ 22 న జమ్మూకాశ్మీర్ లోని పహల్గామ్ లో ఉగ్రవాద దాడిలో 22 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. దానికి ప్రతీకారంగా పాకిస్థాన్ పై భారత్ మే 7 నుంచి 10 వరకు ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. ఈ ఆపరేషన్ లో భాగంగా పాకిస్థాన్, పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ లోని 9 కీలక ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది. అలాగే వందలాది మంది ఉగ్రమూకలను హతమార్చింది.

ManaTV Team

Recent Posts

M4M’s Mohan Vadlapatla and Jo Sharma Win Best Debut Awards at ANDHRAPRADESH FILM CHAMBER OF COMMERCE

Mohan Vadlapatla Honoured as Best Debut Director, While Jo Sharma Receives Best Debut Heroine Award…

17 hours ago

తిరుమల సమాచారం Tirupati Balaji Latest Information 10-10-26 Tirumala Update #thirupathi #manatvlive

తిరుమల సమాచారం Tirupati Balaji Latest Information 10-10-26 Tirumala Update #thirupathi #manatvlive తిరుమల సమాచారం Tirupati Balaji…

23 hours ago

Gold Rate Today : 24K & 22K Prices Sep 10-10-26 #short #goldrate #24kgold #22kgold#goldprice#manatv

Gold Rate Today : 24K & 22K Prices Sep 10-10-26 #short #goldrate #24kgold #22kgold #goldprice#manatv…

1 day ago

అక్టోబర్ 11న నాట్స్ మిషిగన్ చాప్టర్ ప్రారంభోత్సవం

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (NATS) ఆధ్వర్యంలో మిషిగన్ చాప్టర్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని అక్టోబర్ 11, 2026న నిర్వహించనున్నారు. ఉత్తర…

1 day ago

AI పేరు మారుస్తామన్న ట్రంప్.. ఇకపై ‘సూపర్ ఇంటెలిజెన్స్’ (SI)గా పిలవాలంటూ ప్రతిపాదన!

కృత్రిమ మేధస్సు (AI) పేరును ‘సూపర్ ఇంటెలిజెన్స్’ (SI)గా మార్చాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సూచించినట్లు వార్తలు వెలువడ్డాయి.…

1 day ago

ప్రాణాలకు తెగించి 170 మందిని కాపాడిన భారత పైలట్‌కు ఇజ్రాయెల్ అత్యున్నత శౌర్య పురస్కారం!

భారత పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు ఇజ్రాయెల్ ప్రభుత్వం ‘ప్రెసిడెన్షియల్ అవార్డ్ ఫర్ సివిలియన్ హీరోయిజం’ పురస్కారాన్ని ప్రకటించినట్లు సమాచారం.…

2 days ago