– తొలి భారతీయుడిగా రికార్డు
– వంటకళ, కళాత్మక రంగాల్లో చేసిన విశిష్ట సేవలకు గుర్తింపు
అమెరికాలోని న్యూయార్క్ రాష్ట్రంలో భారతీయ చెఫ్ వికాస్ ఖన్నాకు అరుదైన గౌరవం దక్కింది. ఆసియాన్ అమెరికన్ అండ్ పసిఫిక్ ఐలాండర్ హెరిటేజ్ మంథ్ సందర్భంగా ఆయన విశిష్ట సేవలను గుర్తిస్తూ ఈ పురస్కారాన్ని ప్రకటించారు.
ఆల్బనీలో నిర్వహించిన కార్యక్రమంలో వికాస్ ఖన్నాకు న్యూయార్క్ గవర్నర్ క్యాథీ హోచుల్ ప్రత్యేక ప్రశంసాపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వికాస్ ఖన్నా మాట్లాడుతూ భారతీయ సంస్కృతి, ఆహార సంప్రదాయాలను ప్రపంచానికి చెరవేయడం తన లక్ష్యమని తెలిపారు. న్యూయార్క్ రాష్ట్ర చరిత్రలో ఈ గౌరవం అందుకున్న తొలి భారతీయుడిగా నిలవడం మరింత ప్రత్యేకంగా ఉందని చెప్పారు. అమెరికాలో అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న సమాజంగా ఏఏపీఐ కమ్యూనిటీ నిలుస్తోందని పేర్కొన్నారు. 25 మిలియన్లకు పైగా ప్రజలు, విభిన్న సంస్కృతులు అలాగే ఆశయాలకు ఈ కమ్యూనిటీ ప్రతీకగా నిలుస్తుందని తెలిపారు. ఈ గౌరవం కేవలం తన వ్యక్తిగత విజయమే కాకుండా ఆశ, గుర్తింపు, ప్రాతినిధ్యం, వైవిధ్య శక్తికి నిదర్శనమని వెల్లడించారు.
పంజాబ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆరేళ్ల విరామం తర్వాత శిరోమణి అకాలీదళ్ మళ్లీ ఎన్డీఏ కూటమిలో చేరింది. కేంద్ర…
Ekal Vidyalaya is celebrating a remarkable milestone of 25 years with a grand cultural event…
ఎన్విడియా కంపెనీ షేర్ల విలువ పెరగడంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పెట్టుబడుల విలువ భారీగా పెరిగినట్లు అంచనాలు వెలువడుతున్నాయి.…
ప్రముఖ ఇన్వెస్టర్, రచయిత రాబర్ట్ కియోసాకి ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కీలక హెచ్చరికలు చేశారు. అమెరికా ప్రభుత్వం చేస్తున్న భారీ…
The Hindu Temple of Atlanta is organizing special celebrations on the auspicious occasion of Karthika…
Gold Rate Today : 24K & 22K Prices 23-11-26 #short #goldrate #24kgold #22kgold #manatv #goldprice…