Categories: Andhra Pradesh

టీడీపీ మహానాడు రద్దు.!?

– మోదీ పొదుపు చర్యల పిలుపు ఎఫెక్ట్
– టీడీపీ అధినేత చంద్రబాబు కీలక నిర్ణయం
– మహానాడు నిర్వహణను రద్దుపై తర్జనభర్జన

పశ్చిమాసియా ఉద్రిక్తతలు సృష్టించిన సంక్షోభాన్ని ఎదుర్కొవడానికి పొదుపు చర్యలు పాటించాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఎఫెక్ట్ టీడీపీ మహానాడుపై కూడా పడింది. ఈ క్రమంలోనే మహానాడు నిర్వహణపై టీడీపీ అధిష్టానం తర్జనభర్జన పడుతోంది.

ప్రతీ సంవత్సరం టీడీపీ ఎంతో ప్రతిష్టాత్మకంగా మహానాడు నిర్వహిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది కార్యకర్తలు హాజరవుతారు. అయితే, ప్రధాని మోదీ కీలక పిలుపు, రాష్ట్రంలో ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో, ప్రభుత్వం ఓవైపు పొదుపు మంత్రం జపిస్తూ.. మరోవైపు పార్టీ పరంగా కోట్ల రూపాయలు ఖర్చు చేసి భారీ పండుగలా మహానాడు నిర్వహించడం సరికాదనే భావనలో చంద్రబాబు ఉన్నారని తెలుస్తోంది. అందుకే ఈసారి మహానాడు రద్దయ్యే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది.

మరోవైపు సీఎం చంద్రబాబు నేతృత్వంలోని ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. పర్యావరణ పరిరక్షణతో పాటు ఇంధన పొదుపును ప్రోత్సహించేలా వినూత్న నిర్ణయాన్ని ప్రకటించారు. రాష్ట్రంలో వారానికి ఒక రోజు నో వెహికల్ డే పాటించాలని కీలక పిలుపునిచ్చారు. అంటే ఆ రోజున ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రభుత్వ వాహనాలను వాడకుండా పొదుపు చర్యల్లో భాగస్వాములు కానున్నారని తెలుస్తోంది.

ManaTV Team

Recent Posts

కొడుకు కోసం కాజల్ అగర్వాల్ డెసిషన్..!

స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ పెళ్లి, మాతృత్వం తర్వాత కూడా తన సినీ ప్రయాణాన్ని విజయవంతంగా కొనసాగిస్తున్నారు.ప్రస్తుతం 'ది ఇండియా…

16 hours ago

విజయ్ ‘జన నాయగన్’ సెన్సార్ రిపోర్ట్..క్లారిటీ ఇచ్చిన నిర్మాణ సంస్థ

తమిళనాడు సీఎం, దళపతి విజయ్ నటించిన చివరి చిత్రం ‘జన నాయగన్’. ఈ చిత్రం సెన్సార్ ప్రక్రియ పూర్తయి ‘ఏ’…

17 hours ago

యాక్షన్ మోడ్‌లోకి చిరు.. హైదరాబాద్‌లో భారీ ఫైట్ సీక్వెన్స్ షురూ

మెగాస్టార్ చిరంజీవి, బాబీ కాంబినేషన్ లో రాబోతున్న చిత్రం 'మెగా158' (వర్కింగ్ టైటిల్).జూన్ 22న హైదరాబాద్‌లో రెండో షెడ్యూల్ షూటింగ్…

17 hours ago

జెట్ స్పీడ్ లో అనిల్ రావిపూడి సినిమా.. షూటింగ్ లో పాల్గొన్న వెంకీ

టాలీవుట్ స్టార్ హీరోలు విక్టరీ వెంకటేశ్‌, నందమూరి కల్యాణ్‌రామ్‌ కలిసి నటిస్తున్న కొత్త సినిమా షూటింగ్‌ జెట్ స్పీడ్ లో…

19 hours ago

బిగ్ సర్‎ప్రైజ్.. ‘లెనిన్’ కు ఎన్టీఆర్ వాయిస్

టాలీవుడ్ యంగ్ హీరో అఖిల్ అక్కినేని నటిస్తున్న లేటెస్ట్ మాస్ అండ్ యాక్షన్ మూవీ ‘లెనిన్’. తాజాగా ఈ చిత్రానికి…

22 hours ago

సైకో మైండ్.. సియా గోయల్ పై సింగర్ సుచిత్ర షాకింగ్ కామెంట్స్!!

పూణె వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ హత్య కేసులో నిందితురాలైన సియా గోయల్ చర్యలను సమర్థించేలా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన…

22 hours ago