మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో వస్తున్న భారీ చిత్రం ‘పెద్ది’. ఈ సినిమా విడుదలకు ముందే తెలంగాణలో ఊహించని షాక్ తగిలింది. మూవీ ఫస్ట్ వీక్ టికెట్ ధరలను పెంచుకోవడానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ మైత్రీ మూవీ మేకర్స్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం అత్యవసర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించింది. టికెట్ల ధరల విషయంలో ఈ దశలో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. అనంతరం తదుపరి విచారణను జూన్ 6 వ తేదీకి వాయిదా వేసింది.
‘పెద్ది’ సినిమా జూన్ 4న విడుదలవుతుండగా, విచారణ జూన్ 6 కి వాయిదా పడింది. ఈ నేపథ్యంలో ఎలాంటి ప్రయోజనం ఉండదని భావించిన చిత్ర నిర్మాణ సంస్థ తరఫు న్యాయవాది తమ పిటిషన్‌ను ఉపసంహరించుకుంటున్నట్లు కోర్టుకు తెలిపారు. దీంతో ఈ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. ఏపీలో ‘పెద్ది’ సినిమాకు ప్రత్యేక ప్రదర్శనలు, టికెట్ ధరల పెంపునకు అనుమతులు లభించాయి. కానీ తెలంగాణలో మాత్రం పాత ధరలే ఉన్నాయి. దీంతో ఈ విషయం చర్చనీయాంశంగా మారింది.
American Actress Jo Sharma got BEST DEBUT HEROINE AWARD for M4M Movie & Mohan Vadlapatla…
పట్నా నుంచి లఖ్‌నవూకు వెళ్తున్న ఇండిగో విమానాన్ని 17 వేల అడుగుల ఎత్తులో పిడుగు తాకింది. దీంతో విమానం ముందు…
యెమెన్‌కు చెందిన హూతీ తిరుగుబాటుదారులు సౌదీ అరేబియాలోని పౌర విమానాశ్రయాలపై క్షిపణులు, డ్రోన్లతో దాడులకు పాల్పడిన నేపథ్యంలో.. సౌదీ నాయకత్వంలోని…
ఫ్రాన్స్‌లో పాఠశాలల్లో మెరుగైన వసతులు కల్పించడంతో పాటు, ఉపాధ్యాయుల నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు ఆందోళనలకు దిగారు. 15…
ప్రశాంతమైన మనస్సుతోనే నిజమైన శాంతి | భగవద్గీత 2.65 #bhagavadgita #manatv #bhagavadgita #gita #gitasloka #krishna #lordkrishna #spirituality…
తిరుమల సమాచారం Tirupati Balaji Latest Information 8-10-26 Tirumala Update #thirupathi #manatvlive తిరుమల సమాచారం Tirupati Balaji…