టాలీవుడ్ లో నందమూరి కుటుంబానికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. స్వర్గీయ ఎన్టీఆర్ మొదలుపెట్టిన ఈ సిల్వర్ స్క్రీన్ ప్రస్థానాన్ని ఆయన కుమారులు, మనవళ్లు విజయవంతంగా ముందుకు తీసుకెళ్తున్నారు. అయితే నందమూరి ఆడపడుచులు మాత్రం లైమ్ లైట్ కు, గ్లామర్ ప్రపంచానికి కాస్త దూరంగానే ఉంటారు.
నందమూరి బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని కూడా మొదటి నుంచి సినిమాలకు దూరంగానే ఉంటూ వచ్చారు. కానీ ఇటీవల ఆమె ఓ వాణిజ్య ప్రకటనలో కనిపించి, అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇక తాజాగా ఆమె చేసిన ఓ డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఎప్పుడూ క్లాసీగా, కాస్త రిజర్వ్డ్ గా హోమ్లీ లుక్ తో కనిపించే తేజస్విని.. తనలోని డ్యాన్స్ టాలెంట్ ను బయటకు తీశారు. టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ భాను మాస్టర్ తో కలిసి అదిరిపోయే స్టెప్పులు వేశారు. ఆ సాంగ్ బీట్స్ కు తగ్గట్లుగా తేజస్విని చూపించిన గ్రేస్, ఎనర్జీని చూసి నందమూరి ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. ప్రస్తుతం ఈ డ్యాన్స్ కు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. దీంతో బాలయ్య లాగే డ్యాన్స్‌లో మంచి టైమింగ్, ఈజ్ ఉన్నాయి. తండ్రికి తగ్గ కూతురు అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
ప్రముఖ పారిశ్రామికవేత్త, విద్యావేత్త, వైజాగ్ సిట్టింగ్ ఎంపీ మతుకుమిల్లి శ్రీభరత్‌ను తేజస్విని వివాహం చేసుకున్నారు. వీరికి ఆర్యవీర్ అనే కుమారుడు ఉన్నాడు. ఒకవైపు ఫ్యామిలీ బాధ్యతలను చక్కబెడుతూనే, మరోవైపు వ్యాపార వ్యవహారాలను చూసుకోవడంలో తేజస్విని కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇలా మల్టీ టాలెంటెడ్‌గా రాణిస్తున్న తేజస్విని, ఈ లేటెస్ట్ డ్యాన్స్ వీడియోతో మరోసారి టాక్ ఆఫ్ ది టాలీవుడ్‌గా మారారు.
American Actress Jo Sharma got BEST DEBUT HEROINE AWARD for M4M Movie & Mohan Vadlapatla…
పట్నా నుంచి లఖ్‌నవూకు వెళ్తున్న ఇండిగో విమానాన్ని 17 వేల అడుగుల ఎత్తులో పిడుగు తాకింది. దీంతో విమానం ముందు…
యెమెన్‌కు చెందిన హూతీ తిరుగుబాటుదారులు సౌదీ అరేబియాలోని పౌర విమానాశ్రయాలపై క్షిపణులు, డ్రోన్లతో దాడులకు పాల్పడిన నేపథ్యంలో.. సౌదీ నాయకత్వంలోని…
ఫ్రాన్స్‌లో పాఠశాలల్లో మెరుగైన వసతులు కల్పించడంతో పాటు, ఉపాధ్యాయుల నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు ఆందోళనలకు దిగారు. 15…
ప్రశాంతమైన మనస్సుతోనే నిజమైన శాంతి | భగవద్గీత 2.65 #bhagavadgita #manatv #bhagavadgita #gita #gitasloka #krishna #lordkrishna #spirituality…
తిరుమల సమాచారం Tirupati Balaji Latest Information 8-10-26 Tirumala Update #thirupathi #manatvlive తిరుమల సమాచారం Tirupati Balaji…