– సినిమాలో జాన్వీ పాత్రను అభ్యంతరకరంగా చూపించారని నెటిజన్స్ ఫైర్
– ఆ సన్నివేశాలు తొలగిస్తున్నట్టు ప్రకటించిన చిత్ర యూనిట్
– క్షమాపణలు చెప్పిన డైరెక్టర్ బుచ్చిబాబు
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ సినిమా పాజిటివ్ టాక్తో దూసుకుపోతుంది.కానీ హీరోయిన్ జాన్వీకపూర్ పాత్రపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. మహిళలను అవమానించేలా ఆమె పాత్రను తీర్చిదిద్దారంటూ పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సినిమాలో హీరోయిన్ ను చూపించిన తీరు బాలేదని, కేవలం గ్లామర్ కోసమే ఆమెను సినిమాలో ఉంచారని విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే డైరెక్టర్ బుచ్చిబాబు స్పందించారు. క్షమాపణలు కోరుతూ సోషల్ మీడియా వేదికగా సుదీర్ఘమైన పోస్ట్ పెట్టారు.
ఒక ఫిల్మ్ మేకర్ గా సినిమా అనేది ప్రేక్షకులు అలరించాలి. వారిలో స్ఫూర్తిని నింపాలని అనుకుంటాను. ఎవరినీ అగౌరపరచాలని చూడను.పెద్దిలో కొన్ని సీన్లు ఇబ్బందిగా అనిపించినట్లు మా దృష్టికి వచ్చింది. వాటిని సీరియస్ గా తీసుకున్నాం. తెరపైన, తెర వెనుక కూడా మహిళలంటే ఎప్పుడూ అపారమైన గౌరవం ఉంది. మహిళల పాత్రను అగౌరవపరచడం నా ఉద్దేశం కాదు. ఈ సినిమాలో సన్నివేశాలు ఎవరి మనోభావాలనైనా దెబ్బతీసి ఉంటే.. మనస్ఫూర్తిగా క్షమాపణలు కోరుతున్నాను. అలాగే ఆయా సన్నివేశాల్లో మార్పులు చేయాలని నిర్ణయం తీసుకున్నామని బుచ్చిబాబు పోస్టులో పేర్కొన్నారు.
అలాగే ప్రేక్షకులు ఆదరిస్తేనే సినిమా ఎదుగుతుందని బుచ్చిబాబు అన్నారు. అభిమానులతో ఉన్న అనుబంధమే సినిమా రంగాన్ని ముందుకు తీసుకెళ్తుంది. అలాంటి ఫ్యాన్స్ భావోద్వేగాలు, అంచనాలను దృష్టిలో పెట్టుకుని కథలు రాసుకోవాల్సిన బాధ్యత మాపై ఉంది. కొన్ని సున్నితమైన అంశాలపై కచ్చితంగా శ్రద్ధ తీసుకోవాలి. ప్రతి మహిళా గౌరవానికి అర్హురాలే. వారిని శక్తిమంతంగా చూపించడానికి, వారి విలువను పెంచే కథలు చెప్పడానికి మేం కట్టుబడి ఉన్నాం. తమ అభిప్రాయాలను నిజాయితీగా, మనస్ఫూర్తిగా పంచుకున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు అని రాసుకొచ్చారు.
Mohan Vadlapatla Honoured as Best Debut Director, While Jo Sharma Receives Best Debut Heroine Award…
తిరుమల సమాచారం Tirupati Balaji Latest Information 10-10-26 Tirumala Update #thirupathi #manatvlive తిరుమల సమాచారం Tirupati Balaji…
Gold Rate Today : 24K & 22K Prices Sep 10-10-26 #short #goldrate #24kgold #22kgold #goldprice#manatv…
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (NATS) ఆధ్వర్యంలో మిషిగన్ చాప్టర్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని అక్టోబర్ 11, 2026న నిర్వహించనున్నారు. ఉత్తర…
కృత్రిమ మేధస్సు (AI) పేరును ‘సూపర్ ఇంటెలిజెన్స్’ (SI)గా మార్చాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సూచించినట్లు వార్తలు వెలువడ్డాయి.…
భారత పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చర్కు ఇజ్రాయెల్ ప్రభుత్వం ‘ప్రెసిడెన్షియల్ అవార్డ్ ఫర్ సివిలియన్ హీరోయిజం’ పురస్కారాన్ని ప్రకటించినట్లు సమాచారం.…