– #RAPO23 సినిమాటోగ్రాఫర్‌గా జాతీయ అవార్డు గ్రహీత తిరు ఎంపిక
– విజువల్స్‌పై పెరిగిన అంచనాలు
టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని దర్శకత్వంలో రాబోతున్న తొలి చిత్రం #RAPO23. ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టులో జాతీయ అవార్డు గ్రహీత, ప్రముఖ సినిమాటోగ్రాఫర్ తిరునవుక్కరసు అలియాస్ తిరు భాగమయ్యారు.
మే నెల 15న రామ్ తన పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ఆయనే కథ, దర్శకత్వం అందిస్తూ, ‘వీర’ అనే ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ గా వస్తున్న ఈ సినిమాను రామ్ సోదరుడు కృష్ణ పోతినేని ‘రాపో సినిమాటిక్స్’ అనే కొత్త బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. గతంలో ‘ ఆంధ్రా కింగ్ తాలుకా’ చిత్రానికి గీత రచయితగా పని చేసిన రామ్, ఇప్పుడు ఏకంగా రైటర్, డైరెక్టర్, హీరోగా బాధ్యతలు చేపట్టడం విశేషం.
ప్రస్తుతం శరవేగంగా ప్రీ-ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రానికి తిరు కెమెరామెన్‌గా వ్యవహరించనుండటంతో అంచనాలు పెరిగాయి. తిరు చేరికతో #RAPO23 విజువల్స్ అత్యున్నత స్థాయిలో ఉంటాయని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. త్వరలోనే ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుండగా, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలపై క్లారిటీ రావాల్సి ఉంది.
Mohan Vadlapatla Honoured as Best Debut Director, While Jo Sharma Receives Best Debut Heroine Award…
తిరుమల సమాచారం Tirupati Balaji Latest Information 10-10-26 Tirumala Update #thirupathi #manatvlive తిరుమల సమాచారం Tirupati Balaji…
Gold Rate Today : 24K & 22K Prices Sep 10-10-26 #short #goldrate #24kgold #22kgold #goldprice#manatv…
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (NATS) ఆధ్వర్యంలో మిషిగన్ చాప్టర్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని అక్టోబర్ 11, 2026న నిర్వహించనున్నారు. ఉత్తర…
కృత్రిమ మేధస్సు (AI) పేరును ‘సూపర్ ఇంటెలిజెన్స్’ (SI)గా మార్చాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సూచించినట్లు వార్తలు వెలువడ్డాయి.…
భారత పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు ఇజ్రాయెల్ ప్రభుత్వం ‘ప్రెసిడెన్షియల్ అవార్డ్ ఫర్ సివిలియన్ హీరోయిజం’ పురస్కారాన్ని ప్రకటించినట్లు సమాచారం.…