Find Articles

పొత్తుతో వస్తున్నారా? లేక సింగిల్‌గా వస్తున్నారా?.. పవన్ కల్యాణ్ పై ప్రకాశ్ రాజ్ సెటైర్.?

పొత్తుతో వస్తున్నారా? లేక సింగిల్‌గా వస్తున్నారా?.. పవన్ కల్యాణ్ పై ప్రకాశ్ రాజ్ సెటైర్.?

టాలీవుడ్ నటుడు ప్రకాశ్ రాజ్ రాజకీయాలపై తనదైన శైలిలో స్పందిస్తూనే ఉంటారు. తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై పరోక్షంగా వ్యంగ్యాస్త్రాన్ని సంధించారు. తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తామని జనసేనాని ప్రకటించిన నేపథ్యంలో ప్రకాశ్ రాజ్ విమర్శ చేశారని తెలుస్తోంది.

పవన్ కల్యాణ్ పేరును ఎక్కడా ప్రస్తావించకపోయినప్పటికీ, ప్రకాశ్ రాజ్ తన ఎక్స్ వేదికగా సెటైరికల్ పోస్ట్ పెట్టారు. ‘ వస్తానంటే వద్దంటామా.. రండి సార్.. కానీ అంతకంటే ముందు ఒకటి చెప్పండి. మీరు పొత్తుతో వస్తు్న్నారా.? లేక సింగిల్ గా వస్తున్నారా? ఊరికే అడుగుతున్నా.? అంటూ ట్వీట్ లో పేర్కొన్నారు. దీనికి ఎప్పటి తరహాలోనే తన సిగ్నేచర్ హ్యాష్‌ట్యాగ్ #JustAsking ను జత చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

పవన్ కల్యాణ్ అభిమానులు ప్రకాశ్ రాజ్ పై తీవ్రంగా మండిపడుతున్నారు. తెలంగాణ రాజకీయాల గురించి మాట్లాడే ముందు, గతంలో బెంగళూరులో పోటీ చేసిన సమయంలో కనీసం డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయిన చరిత్రను గుర్తు చేసుకోవాలంటూ గట్టిగా కౌంటర్లు ఇస్తున్నారు. పవన్ తెలంగాణలోకి ఎలా వస్తే మీకెందుకు.? అంటూ ప్రశ్నిస్తున్నారు. దీంతో ఈ వ్యవహారం నెట్టింట తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

ManaTV Team