ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, కోలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో రాబోతున్న మోస్ట్ అవేటెడ్ ప్రాజెక్ట్ ‘AA23’. గత కొన్ని రోజులుగా ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఆగిపోయిందని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారానికి ఫుల్ స్టాప్ పడింది.
ఇటీవల సినీ ఇండస్ట్రీలో గాసిప్స్ హద్దులు లేకుండా వ్యాపిస్తున్నాయి. ఏది నిజం, ఏది అబద్ధం అని తెలుసుకోవడం అభిమానులకు, ప్రేక్షకులకు పెద్ద టాస్క్ గా మారుతోంది. ఇదే తరహాలో పాన్ ఇండియా హీరో అల్లు అర్జున్, క్రేజీ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో రావాల్సిన ఒక భారీ ప్రాజెక్ట్ ఆగిపోయిందని నెట్టింట ప్రచారం జరిగింది. తాజాగా ఈ పుకార్లకు ఫేమస్ డైరెక్టర్, రైటర్ రత్నకుమార్ తన స్టైల్ లో చెక్ పెట్టారు. లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో వచ్చిన ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ ‘ విక్రమ్’ సినిమా రిలీజై సక్సెస్ ఫుల్ గా నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా సోషల్ మీడియా వేదికగా ఒక స్పెషల్ పోస్ట్ పెట్టారు. ఈ సందర్భంగా డైరెక్టర్ లోకేష్ ను అభినందించిన ఆయన తాను ‘AA23’ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు రాసుకొచ్చారు. ఆయన డైరెక్ట్ గా ఈ రూమర్ల గురించి ప్రస్తావించకపోయినప్పటికీ, బన్నీ -లోకేష్ సినిమా లైన్ లోనే ఉందని క్లారిటీ ఇచ్చారు.
అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీ డైరెక్షన్ లో రాకా మూవీ చేస్తున్నారు. ఆ తరువాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో మరో మూవీ చేయబోతున్నారు. అటు లోకేష్ ఖైదీ 2 చేయడానికి రెడీ అవుతున్నారని తెలుస్తోంది. ఇద్దరికీ ఇప్పట్లో టైమ్ సెట్ అయ్యే అవకాశాలు కనిపించడం లేదు. ఈ సమయంలోనే పాన్ ఇండియా మూవీ అటకెక్కిందన్న వార్తలు రావడంతో ప్రతి ఒక్కరూ అల్లు అర్జున్, లోకేష్ మూవీనే అని అనుకున్నారు. కానీ రత్న కుమార్ ట్వీట్ తో ఈ రూమర్స్ కు ఫుల్ స్టాప్ పడింది.
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (NATS) ఆధ్వర్యంలో మిషిగన్ చాప్టర్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని అక్టోబర్ 11, 2026న నిర్వహించనున్నారు. ఉత్తర…
కృత్రిమ మేధస్సు (AI) పేరును ‘సూపర్ ఇంటెలిజెన్స్’ (SI)గా మార్చాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సూచించినట్లు వార్తలు వెలువడ్డాయి.…
భారత పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు ఇజ్రాయెల్ ప్రభుత్వం ‘ప్రెసిడెన్షియల్ అవార్డ్ ఫర్ సివిలియన్ హీరోయిజం’ పురస్కారాన్ని ప్రకటించినట్లు సమాచారం.…
అమెరికా టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సంస్థపై ఆ దేశ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు వార్తలు వెలువడ్డాయి.…
తిరుమల సమాచారం Tirupati Balaji Latest Information 9-10-26 Tirumala Update #thirupathi #manatvlive తిరుమల సమాచారం Tirupati Balaji…
Gold Rate Today : 24K & 22K Prices Sep 9-10-26 #short #goldrate #24kgold #22kgold #goldprice#manatv…