Categories: Andhra Pradesh

మహానాడు ఏర్పాట్లు.. నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం

టీడీపీ మహానాడు ఏర్పాట్లపై పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు అధ్యక్షతన పొలిట్‌బ్యూరో సమావేశం జరిగింది. మే 27, 28 తేదీల్లో హైబ్రిడ్ పద్ధతిలో నిర్వహించనున్న మహానాడు కార్యక్రమ అజెండాపై నేతలకు ఆయన కీలక దిశానిర్దేశం చేశారు.

ఈ సమావేశానికి ఉండవల్లిలోని నివాసం నుంచి చంద్రబాబు వర్చువల్‌గా హాజరవగా, ఇతర నేతలు మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్ నుంచి పాల్గొన్నారు. ఉదయం 9 గంటల నుంచే కార్యక్రమాలు ప్రారంభించాలని, ప్రతి వక్త తమకు కేటాయించిన అంశంపైనే సూటిగా, స్పష్టంగా మాట్లాడాలని చంద్రబాబు ఆదేశించారు. మొత్తంగా మహానాడును విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

పార్టీకి మహిళలు, బీసీలు రెండు కళ్ల లాంటివారని చంద్రబాబు తెలిపారు. “మహిళలకు టీడీపీ ఇస్తున్న ప్రాధాన్యాన్ని అందరికీ అర్థమయ్యేలా చాటాలని, జనాభాలో 50 శాతం ఉన్న బీసీలు పార్టీ ఆవిర్భావం నుంచీ మనకు వెన్నుదన్నుగా ఉన్నారని పేర్కొన్నారు. వారి అభివృద్ధికి పార్టీ కట్టుబడి ఉందనే సందేశం స్పష్టంగా వెళ్లాలని నేతలకు చంద్రబాబు సూచించారు. “కార్యకర్తే అధినేత” అనే నినాదం మహానాడులో స్పష్టంగా ప్రతిబింబించాలని, పార్టీ సంప్రదాయ ఓటు బ్యాంకును జాగ్రత్తగా కాపాడుకోవాలని స్పష్టం చేశారు.

అయితే ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పొదుపు మంత్రం నేపథ్యంలో, ఈసారి మహానాడును మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్ నుంచి హైబ్రిడ్ విధానంలో నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే పార్టీ అగ్రనేతలు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదిక పైనుంచి ప్రసంగించనుండగా, పార్టీ క్యాడర్ కోసం రాష్ట్రవ్యాప్తంగా వందల సంఖ్యలో డిజిటల్ స్క్రీన్లు ఏర్పాటు చేస్తున్నారు.

ManaTV Team

Recent Posts

7 వేల అడుగుల ఎత్తులో ఇండిగో విమానానికి పిడుగు.. సేఫ్‌గా ల్యాండింగ్

పట్నా నుంచి లఖ్‌నవూకు వెళ్తున్న ఇండిగో విమానాన్ని 17 వేల అడుగుల ఎత్తులో పిడుగు తాకింది. దీంతో విమానం ముందు…

48 minutes ago

హూతీ స్థావరాలపై సౌదీ కూటమి భారీ దాడులు

యెమెన్‌కు చెందిన హూతీ తిరుగుబాటుదారులు సౌదీ అరేబియాలోని పౌర విమానాశ్రయాలపై క్షిపణులు, డ్రోన్లతో దాడులకు పాల్పడిన నేపథ్యంలో.. సౌదీ నాయకత్వంలోని…

53 minutes ago

ఫ్రాన్స్‌లో విద్యార్థుల నిరసనలు తీవ్రం

ఫ్రాన్స్‌లో పాఠశాలల్లో మెరుగైన వసతులు కల్పించడంతో పాటు, ఉపాధ్యాయుల నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు ఆందోళనలకు దిగారు. 15…

60 minutes ago

ప్రశాంతమైన మనస్సుతోనే నిజమైన శాంతి | భగవద్గీత 2.65 #bhagavadgita #manatv

ప్రశాంతమైన మనస్సుతోనే నిజమైన శాంతి | భగవద్గీత 2.65 #bhagavadgita #manatv #bhagavadgita #gita #gitasloka #krishna #lordkrishna #spirituality…

8 hours ago

తిరుమల సమాచారం Tirupati Balaji Latest Information 8-10-26 Tirumala Update #thirupathi #manatvlive

తిరుమల సమాచారం Tirupati Balaji Latest Information 8-10-26 Tirumala Update #thirupathi #manatvlive తిరుమల సమాచారం Tirupati Balaji…

9 hours ago

Gold Rate Today : 24K & 22K Prices Sep 8-10-26 #short #goldrate #24kgold #22kgold #goldprice#manatv

Gold Rate Today : 24K & 22K Prices Sep 8-10-26 #short #goldrate #24kgold #22kgold #goldprice#manatv…

9 hours ago