Find Articles

మైఖేల్ జాక్సన్ సాంగ్.. శ్రద్ధా కపూర్ స్టెప్పులు

మైఖేల్ జాక్సన్ సాంగ్.. శ్రద్ధా కపూర్ స్టెప్పులు

బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఓ డ్యాన్స్ వీడియో వైరల్ అవుతోంది.పాప్ దిగ్గజం మైఖేల్ జాక్సన్ క్లాసిక్ సాంగ్ ‘డోంట్ స్టాప్ టిల్ యూ గెట్ ఇన‌ఫ్’కు శ్రద్ధా తన ఇంట్లో నైట్ డ్రెస్‌లోనే స్టెప్పులేశారు.ఈ వీడియోను ఇన్‌స్టా వేదికగా పంచుకున్న శ్రద్ధా..‘‘ డ్యాన్స్ చేయించే వ్యక్తిని కనుక్కోండి’’ అంటూ ఓ ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ ను యాడ్ చేశారు. అయితే ఈ వీడియోను రాహుల్ మోదీ రికార్డ్ చేశారని తెలుస్తోంది.

గత కొంతకాలంగా శ్రద్ధా కపూర్, సినీ రచయిత రాహుల్ మోదీ ప్రేమలో ఉన్నారంటూ వార్తలు వస్తున్నాయి.అంతేకాదు వీరిద్దరూ ముంబైలో పలు సందర్భాల్లో డిన్నర్, డేట్‌లకు వెళ్తూ కెమెరా కంటికి చిక్కారు. గతంలో వీరిద్దరూ విడిపోయారని రూమర్స్ వచ్చినప్పటికీ, 2024 డిసెంబర్‌లో రాహుల్‌తో కలిసి వడా పావ్ తింటున్న ఫొటోను షేర్ చేసి శ్రద్ధా వాటికి చెక్ పెట్టారు.తాజాగా శ్రద్దా పెట్టిన పోస్టుతో వీరిద్దరి బంధంపై జరుగుతున్న ప్రచారానికి మరింత బలం చేకూరింది.

 

ManaTV Team