Categories: Movie News

విజయ్ తో రిలేషన్ రూమర్స్.. ఇన్ డైరెక్ట్ గా త్రిష స్ట్రాంగ్ కౌంటర్

తమిళనాడు సీఎం విజయ్, సౌత్ క్వీన్ త్రిష మధ్య ఉన్న బంధంపై రకరకాల రూమర్లు వినిపిస్తున్నాయి. గతంలో ఓ ప్రొడ్యూసర్ కొడుకు పెళ్లి వేడుకలో వీరిద్దరూ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. ఇటీవ‌ల కోలీవుడ్ హీరో అజిత్ త‌ల్లి మ‌ర‌ణించ‌డంతో అత‌డిని ప‌రామ‌ర్శించ‌డానికి త్రిష‌తో క‌లిసి ద‌ళ‌ప‌తి విజ‌య్ రావ‌డం త‌మిళ‌నాట చర్చనీయాంశంగా మారింది.

అజిత్ ను పరామర్శించడానికి విజయ్ తో కలిసి త్రిష వెళ్లడంపై నెటిజన్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. సెలబ్రిటీల వ్యక్తిగత ట్రిప్ లకు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం కరెక్ట్ కాదంటూ కామెంట్స్ చేశారు. ఈ ట్రోల్స్ కు త్రిష తనదైన శైలిలో స్పందించారు. తన పెంపుడు కుక్క ఫొటోను షేర్ చేసిన ఈ భామ.. ‘‘ నా వ్యక్తిగత విషయాల్లో తలదూర్చడానికి దీన్ని మాత్రమే అనుమతిస్తాను’’ అంటూ ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ ఇచ్చారు. నేరుగా ఎవరి పేరును ఆమె ప్రస్తావించకపోయినప్పటికీ, తనపై అసత్య ప్రచారాలు చేస్తున్న వారికి కౌంటర్ గా ఈ పోస్ట్ పెట్టారని అభిమానులు భావిస్తున్నారు.

అంతేకాదు, మే నెల జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ కూడా త్రిష మ్యాజికల్ మే పోస్ట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఏడాది మే నెలను తలచుకున్నప్పుడల్లా తన ముఖంపై చిరునవ్వు వస్తూనే ఉంటుందని ఆమె తెలిపారు. మే నెలలో త్రిష పుట్టిన రోజు ఉండటమే కాదు, తన ఆప్తమిత్రుడు విజయ్ తమిళనాడు ఎన్నికల్లో ఘన విజయం సాధించి, సీఎం అయ్యారు. దీనికి తోడు ఆమె నటించిన కరుప్పు సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ హిట్ గా నిలిచింది. ఈ వరుస విజయాలతోనే ఆమె ఈ పోస్ట్ పెట్టారని సమాచారం.

ManaTV Team

Recent Posts

అక్టోబర్ 11న నాట్స్ మిషిగన్ చాప్టర్ ప్రారంభోత్సవం

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (NATS) ఆధ్వర్యంలో మిషిగన్ చాప్టర్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని అక్టోబర్ 11, 2026న నిర్వహించనున్నారు. ఉత్తర…

30 minutes ago

AI పేరు మారుస్తామన్న ట్రంప్.. ఇకపై ‘సూపర్ ఇంటెలిజెన్స్’ (SI)గా పిలవాలంటూ ప్రతిపాదన!

కృత్రిమ మేధస్సు (AI) పేరును ‘సూపర్ ఇంటెలిజెన్స్’ (SI)గా మార్చాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సూచించినట్లు వార్తలు వెలువడ్డాయి.…

31 minutes ago

ప్రాణాలకు తెగించి 170 మందిని కాపాడిన భారత పైలట్‌కు ఇజ్రాయెల్ అత్యున్నత శౌర్య పురస్కారం!

భారత పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు ఇజ్రాయెల్ ప్రభుత్వం ‘ప్రెసిడెన్షియల్ అవార్డ్ ఫర్ సివిలియన్ హీరోయిజం’ పురస్కారాన్ని ప్రకటించినట్లు సమాచారం.…

40 minutes ago

6 వేల మంది ఉద్యోగులకు లేఆఫ్‌లు.. 6,300 హెచ్‌-1బీ వీసాలపై మైక్రోసాఫ్ట్‌కు జేడీ వాన్స్ ప్రశ్నలు!

అమెరికా టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సంస్థపై ఆ దేశ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు వార్తలు వెలువడ్డాయి.…

42 minutes ago

తిరుమల సమాచారం Tirupati Balaji Latest Information 9-10-26 Tirumala Update #thirupathi #manatvlive

తిరుమల సమాచారం Tirupati Balaji Latest Information 9-10-26 Tirumala Update #thirupathi #manatvlive తిరుమల సమాచారం Tirupati Balaji…

12 hours ago

Gold Rate Today : 24K & 22K Prices Sep 9-10-26 #short #goldrate #24kgold #22kgold #goldprice#manatv

Gold Rate Today : 24K & 22K Prices Sep 9-10-26 #short #goldrate #24kgold #22kgold #goldprice#manatv…

13 hours ago