కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ త్వరలోనే పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారా.? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది.ధనుష్ తండ్రి కస్తూరి రాజా రీసెంట్ గా ఓ ప్రైవేట్ ఈవెంట్ చేసిన కామెంట్స్ ఈ విషయానికి మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి.
చెన్నైలోని సాలిగ్రామంలో జరిగిన ఒక ప్రైవేట్ ఈవెంట్‌కు కస్తూరి రాజా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంలో ధనుష్ పాలిటిక్స్ లోకి వచ్చే అవకాశం ఉందా.? అని అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. రాజకీయాల్లోకి రావడం అనేది వారి వ్యక్తిగత ఇష్టంపై ఆధారపడి ఉంటుంది. ఆసక్తి ఉన్న ఎవరైనా పాలిటిక్స్‌లోకి ప్రవేశించవచ్చు. నా కొడుకు మాత్రమే కాదు, నా మనవళ్లు కూడా భవిష్యత్తులో రాజకీయాల్లోకి రావొచ్చు. ఫ్యూచర్‌లో వారు ఈ మార్గాన్ని ఎంచుకునే అవకాశాలను కొట్టిపారేయలేమని చెప్పారు. దీంతో ధనుష్ పొలిటికల్ ఎంట్రీ కన్ఫర్మ్ అనే చర్చ జోరందుకుంది.
తమిళనాట సినిమాలకు, రాజకీయాలకు ఉన్న లింక్ ఈనాటిది కాదు.గత కొన్నాళ్లుగా పలువురు సినీ సెలబ్రిటీలు రాజకీయాల్లో రాణిస్తున్నారు. ఎంజీఆర్, జయలలిత వంటి యాక్టర్స్ పాలిటిక్స్ లోనూ తమ మార్క్ వేశారు. ప్రజల మనసులో చెరగని ముద్ర వేసుకున్నారు. తాజాగా దళపతి విజయ్ అసెంబ్లీ ఎన్నికల్లో సంచలన విజయం సాధించి, సీఎంగా బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే బాటలో స్టార్ హీరో ధనుష్ కూడా నడుస్తారనే టాక్ నడుస్తోంది.అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.ధనుష్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు.
తిరుమల సమాచారం Tirupati Balaji Latest Information 9-10-26 Tirumala Update #thirupathi #manatvlive తిరుమల సమాచారం Tirupati Balaji…
Gold Rate Today : 24K & 22K Prices Sep 9-10-26 #short #goldrate #24kgold #22kgold #goldprice#manatv…
American Actress Jo Sharma got BEST DEBUT HEROINE AWARD for M4M Movie & Mohan Vadlapatla…
పట్నా నుంచి లఖ్‌నవూకు వెళ్తున్న ఇండిగో విమానాన్ని 17 వేల అడుగుల ఎత్తులో పిడుగు తాకింది. దీంతో విమానం ముందు…
యెమెన్‌కు చెందిన హూతీ తిరుగుబాటుదారులు సౌదీ అరేబియాలోని పౌర విమానాశ్రయాలపై క్షిపణులు, డ్రోన్లతో దాడులకు పాల్పడిన నేపథ్యంలో.. సౌదీ నాయకత్వంలోని…
ఫ్రాన్స్‌లో పాఠశాలల్లో మెరుగైన వసతులు కల్పించడంతో పాటు, ఉపాధ్యాయుల నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు ఆందోళనలకు దిగారు. 15…