క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ క్రికెట్ అరంగేట్రంపై సందిగ్ధత నెలకొంది. ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనల కోసం ప్రకటించిన భారత టీ20 జట్టులో చోటు దక్కించుకున్న ఈ 15 ఏళ్ల కుర్రాడి అరంగేట్రం ఐర్లాండ్ సిరీస్‌లోనే జరగవచ్చని అంతా భావించారు. కానీ, ఆ దేశంలో సామాజిక అశాంతి, అల్లర్లు చెలరేగాయి. దీంతో అసలు సిరీస్ జరుగుతుందా? లేదా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ఐర్లాండ్‌లో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఇప్పటికే లిస్బన్‌లో జరగాల్సిన ఇంటర్-ప్రొవిన్షియల్ టీ20 ఫెస్టివల్ క్యాన్సిల్ అయింది. ఈ నేపథ్యంలో 14న జరగాల్సిన ఐరిష్ సీనియర్ కప్, నేషనల్ కప్ మ్యాచ్‌ల నిర్వహణపై రాబోయే 48 గంటల్లో నిర్ణయం తీసుకుంటామని క్రికెట్ ఐర్లాండ్ తెలిపింది. ప్రస్తుతం అల్లర్లు జరుగుతున్న ప్రాంతాల్లో పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నామని, ప్లేయర్స్, కోచ్‌లు, అధికారులు, మద్దతుదారుల భద్రతే తమకు ముఖ్యమని పేర్కొంది. ఒకవేళ పరిస్థితులు అదుపులోకి రాకపోతే భారత్-ఐర్లాండ్ సిరీస్‌పై కూడా ప్రభావం పడే అవకాశం ఉంది.
అంతర్జాతీయ అరంగేట్రం జరగాల్సిన సిరీస్‌పై అనిశ్చితి నెలకొనప్పటికీ, వైభవ్ సూర్యవంశీ మాత్రం తన ఆటతీరును మరింత మెరుగుపరుచుకునే పనిలో పడ్డారు. ఐర్లాండ్‌లో పరిస్థితులు త్వరగా చక్కబడాలని, ఈ యువ సంచలనం అరంగేట్రం చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Mohan Vadlapatla Honoured as Best Debut Director, While Jo Sharma Receives Best Debut Heroine Award…
తిరుమల సమాచారం Tirupati Balaji Latest Information 10-10-26 Tirumala Update #thirupathi #manatvlive తిరుమల సమాచారం Tirupati Balaji…
Gold Rate Today : 24K & 22K Prices Sep 10-10-26 #short #goldrate #24kgold #22kgold #goldprice#manatv…
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (NATS) ఆధ్వర్యంలో మిషిగన్ చాప్టర్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని అక్టోబర్ 11, 2026న నిర్వహించనున్నారు. ఉత్తర…
కృత్రిమ మేధస్సు (AI) పేరును ‘సూపర్ ఇంటెలిజెన్స్’ (SI)గా మార్చాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సూచించినట్లు వార్తలు వెలువడ్డాయి.…
భారత పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు ఇజ్రాయెల్ ప్రభుత్వం ‘ప్రెసిడెన్షియల్ అవార్డ్ ఫర్ సివిలియన్ హీరోయిజం’ పురస్కారాన్ని ప్రకటించినట్లు సమాచారం.…