గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు సానా కాంబినేషన్లో వస్తున్న చిత్రం ‘ పెద్ది’ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల ప్రమోషన్స్ లో వేగం పెంచిన చిత్ర యూనిట్, తాజాగా ఫ్యాన్స్‌కు అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చింది.
సినిమాలోని స్పెషల్ సాంగ్ ‘హెల్లల్లల్లో’కు సంబంధించిన ప్రోమోను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ ప్రోమోలో రామ్ చరణ్, శృతి హాసన్ తమ డ్యాన్స్ స్టెప్పులతో అభిమానుల్లో ఫుల్ జోష్ నింపారు. ఈ పాటకు ప్రముఖ గేయ రచయిత అనంత శ్రీరామ్ సాహిత్యం అందించగా, ఆస్కార్ విజేత, సంగీత దిగ్గజం ఏ.ఆర్. రెహమాన్ స్వరాలు సమకూర్చారు. దానికి తోడు ఇది స్పెషల్ సాంగ్ కావడంతో ఈ పాటపై ఆసక్తి పెరిగిపోయింది. రేపు ఈ పూర్తి పాటను విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.