ఏపీ మంత్రి నారా లోకేశ్ కుమారుడు దేవాన్ష్ డిజిటల్ ప్రపంచంలోకి ఎంట్రీ ఇచ్చారు. డైనో డీట్స్ పేరుతో ఆయన ప్రారంభించిన యూట్యూబ్ పాడ్ కాస్ట్ ఫస్ట్ ఎపిసోడ్ రిలీజైంది. ఇందులో భాగంగా దేవాన్ష్ ప్రొఫెషనల్ హోస్ట్‌లా స్టుడియో సెటప్‌లో కూర్చొని డైనోసార్ల గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
దేవాన్ష్‌ను ప్రోత్సహిస్తూ ‘‘డైనోసార్ల ప్రపంచంలోకి అడుగుపెట్టండి’’ అంటూ నారా లోకేశ్ పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. దేవాన్ష్ మిలియన్ల సంవత్సరాల క్రితం నాటి మెసోజోయిక్ యుగం విశేషాలను, పురాతన శిలాజాల్లో దాగి ఉన్న సూక్ష్మ రహస్యాలను లోతుగా పరిశోధించి వివరించబోతున్నారు. మరీ ముఖ్యంగా మిలియన్ల సంవత్సరాల క్రితం మన భారతదేశ గడ్డపై సంచరించిన ప్రమాదకరమైన జంతువు గురించి చెప్పుబోతున్నాడు. డైనోసార్ల అభిమానులతో పాటు విజ్ఞానాన్ని ఇష్టపడే వారందరికీ ఈ గత చరిత్రను సరికొత్తగా పరిచయం చేయనున్నాడు. గతం ఇప్పటికీ మన కళ్లముందే సజీవంగా ఉందనే విషయాన్ని నిరూపించబోతున్నాడు’’ అంటూ ‘ఎక్స్’ వేదికగా పోస్ట్ చేశారు.