Find Articles

ఆగస్ట్ రేసులో మాస్ మహారాజా రవితేజ.. స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇస్తారా.?

ఆగస్ట్ రేసులో మాస్ మహారాజా రవితేజ.. స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇస్తారా.?

మాస్ మహారాజా రవితేజకు కొన్నాళ్లుగా సరైన విజయాలు లేవు. ‘రావణాసుర’ నుంచి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ వరకు ప్రతి సినిమా నిరాశనే మిగిల్చింది. ఈ క్రమంలోనే రవితేజ బాక్సాఫీస్ వద్ద సాలిడ్ కమ్ బ్యాక్ కోసం ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం శివ నిర్వాణ డైరెక్షన్ లో రాబోతున్న మోస్ట్ అవేటెడ్ రస్టిక్ యాక్షన్ ఎమోషనల్ డ్రామా ‘ ఇరుముడి’ లో నటిస్తున్నారు.

మైత్రీ మూవీ మేకర్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకుందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ పవర్ ఫుల్ కమ్ బ్యాక్ మూవీని భారీ స్థాయిలో 2026 ఆగస్ట్ లో రిలీజ్ చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఆగస్ట్ నెలలో లాంగ్ వీకెండ్స్, హాలిడేస్ ను క్యాష్ చేసుకోవడమే లక్ష్యంగా రిలీజ్ డేట్ ను లాక్ చేయాలని చూస్తున్నారని సమాచారం.

తండ్రీ కూతుళ్ల మధ్య సాగే సున్నితమైన ఎమోషన్స్, హై వోల్టేజ్ యాక్షన్ ఎలిమెంట్స్ తో పాటు దైవికమైన అంశాలతో ఈ సినిమా ఉండబోతుందని తెలుస్తోంది. ఈ సినిమాలో రవితేజ సరసన తమిళ బ్యూటీ ప్రియా భవానీ శంకర్ నటిస్తుండగా.. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. మరి భారీ అంచనాల నడుమ రాబోతున్న రస్టిక్ యాక్షన్ మూవీ రవితేజకు సాలిడ్ కమ్ బ్యాక్ గా నిలుస్తుందా.? బాక్సాఫీస్ వద్ద సంచనాలు సాధిస్తుందా? చూడాలి.

ManaTV Team