Find Articles

దిశా పటానీ-మౌనీరాయ్ పై లెస్బియన్ రూమర్స్‌..!

దిశా పటానీ-మౌనీరాయ్ పై లెస్బియన్ రూమర్స్‌..!

బాలీవుడ్ గ్లామర్ బ్యూటీస్ దిశా పటానీ, మౌనీ రాయ్ మధ్య ఉన్న సిస్టర్లీ బాండింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎక్కడ చూసినా ఈ ఇద్దరు భామలు జంటగా సందడి చేస్తూ కెమెరా కంటికి చిక్కుతుంటారు. కలిసి విదేశీ టూర్లు వేయడం, లేట్ నైట్ పార్టీల్లో క్లోజ్‌గా దిగిన ఫోటోలను షేర్ చేయడంతో, సోషల్ మీడియాలో వీరిద్దరిపై రకరకాల రూమర్స్ షికారు చేశాయి. వీరు కేవలం స్నేహితులు మాత్రమే కాదు, అంతకు మించి రిలేషన్‌లో ఉన్నారంటూ కొందరు నెటిజన్లు ఏకంగా లెస్బియన్స్ ట్యాగ్ కూడా తగిలించేశారు. ఈ ట్రోల్స్‌కు, రూమర్స్‌కు చెక్ పెట్టేందుకు మౌనీ రాయ్ తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక క్రేజీ పోస్ట్ పెట్టారు. దిషాతో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేస్తూ.. “నా లిటిల్ సిస్టర్‌ను చాలా మిస్ అవుతున్నాను” అంటూ క్యాప్షన్ ఇచ్చారు. తామిద్దరం అక్కాచెల్లెళ్ల లాంటి వాళ్లమే తప్ప, నెటిజన్లు అనుకుంటున్నట్టు మరేమీ లేదని మౌనీ చాలా పరోక్షంగా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.

అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ బయటకు వచ్చింది. ఈ పోస్ట్ పెట్టిన కొద్దిసేపటికే మౌనీ రాయ్ దాన్ని తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుండి అకస్మాత్తుగా డిలీట్ చేసేశారు. ఇంకేముంది.. నెటిజన్లకు మళ్లీ ఇంట్రెస్టింగ్ టాపిక్ దొరికినట్లయింది. అసలు ఆ పోస్ట్‌ను ఎందుకు తొలగించాల్సి వచ్చింది? అనేదానిపై సోషల్ మీడియాతో పాటు బాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్ నడుస్తోంది. నెగిటివ్ కామెంట్స్, విపరీతమైన ట్రోలింగ్ భరించలేక డిలీట్ చేశారా? లేక పొరపాటున ‘సిస్టర్’ అని పెట్టేసానా అనే సందేహంతో తీసేశారా? అంటూ సోషల్ మీడియాలో రకరకాల కథనాలు అల్లేస్తున్నారు. ఏదేమైనా, ఈ ఇద్దరు భామలు ఎన్ని రకాలుగా హింట్లు ఇచ్చి క్లారిటీ ఇస్తున్నా, నెటిజన్ల క్రియేటివిటీకి, వారిపై వస్తున్న రూమర్స్‌కు మాత్రం బ్రేకులు పడటం లేదు.

 

ManaTV Team