Find Articles

కర్ణాటక సీఎంగా ఉపేంద్ర? .. ప్రజలు ఆదరించాలన్న శివన్న

కర్ణాటక సీఎంగా ఉపేంద్ర? .. ప్రజలు ఆదరించాలన్న శివన్న

కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ రాజకీయాలపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.తన లేటెస్ట్ మూవీ ‘పెద్ది’ ప్రమోషన్ల ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన నటుడు ఉపేంద్ర రాజకీయ భవిష్యత్తుపై కీలక వ్యాఖ్యలు చేశారు.

తమిళనాడు రాజకీయాల్లో నటుడు విజయ్ సాధించిన ఘన విజయాన్ని గుర్తు చేసిన శివరాజ్ కుమార్ కర్ణాటకలో ఉపేంద్రకు ఎందుకు అలాంటి మద్దతు ఇవ్వకూడదని ప్రశ్నించారు. భవిష్యత్తులో ఉపేంద్ర కర్ణాటక ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నారు. నటీనటులు కేవలం సినిమాల్లో మాత్రమే ముఖానికి రంగులు వేసుకుంటారని, నిజ జీవితంలో రంగులు మార్చరని స్పష్టం చేశారు.

మంచి పనులు చేయడానికి ఎలాంటి కవరేజ్ కానీ, పబ్లిసిటీ కానీ అవసరం లేదని శివరాజ్ కుమార్ అన్నారు.చేసే పనిలో నిజాయతీ ఉంటే, ప్రజలు దాన్ని గుర్తిస్తారని తెలిపారు.అలాగే దేవుడి ఆశీస్సులూ ఉంటాయని పేర్కొన్నారు. తమ కుటుంబం ఎప్పటి నుంచో మీడియా ప్రచారం కోరుకోకుండా సామాన్యులకు సేవ చేస్తోందని గుర్తు చేశారు.అదే తరహాలో అభిమానులు కూడా సమాజంలో నలుగురికీ సాయం చేస్తూ స్ఫూర్తిగా నిలవాలని పిలుపునిచ్చారు.ఈ సందర్భంలోనే తనకు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం లేదని క్లారిటీ ఇచ్చారు.

ManaTV Team