
తెలంగాణపై జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రత్యేక దృష్టి
జూన్ 2న తెలంగాణ జనసేన ముఖ్య నేతల భేటీ
హైదరాబాద్ వేదికగా కీలక కార్యాచరణపై చర్చ
తెలంగాణలో జనసేన బలోపేతం లక్ష్యంగా పవన్ వ్యూహాలు
ఏపీ ఉప ముఖ్యమంత్రిగా ఉంటూనే తెలంగాణపై ఫోకస్
వచ్చే జీహెచ్‌ఎంసీ ఎన్నికలే జనసేన టార్గెట్
పార్టీ నిర్మాణం, సభ్యత్వ నమోదుపై కీలక నిర్ణయాలు
ప్రస్తుత రాజకీయ పరిణామాలపై విస్తృత చర్చలు
పవన్ రాకతో జనసేన శ్రేణుల్లో కొత్త ఉత్సాహం
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున కీలక భేటీ
ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణ రాజకీయాలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఆయన ఇక్కడ పార్టీని బలోపేతం చేసేందుకు పక్కా ప్లాన్ ప్రిపేర్ చేస్తున్నారు. జూన్ 2న హైదరాబాద్‌లో తెలంగాణ జనసేన ముఖ్య నేతలు, నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఈ భేటీలో ప్రస్తుత తెలంగాణ రాజకీయ పరిణామాలు, పార్టీ భవిష్యత్తు కార్యాచరణపై విస్తృతంగా చర్చిస్తారు. జనసేనను గ్రౌండ్ లెవల్ నుంచి బలోపేతం చేయడమే లక్ష్యంగా పవన్ కళ్యాణ్ ప్లాన్ చేస్తున్నారు. రాబోయే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలతో పాటు భవిష్యత్తులో వచ్చే అన్ని ఎన్నికల్లోనూ జనసేన జెండా ఎగురవేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ సమావేశంలో పార్టీ క్యాడర్‌కు దిశానిర్దేశం చేసి, సభ్యత్వ నమోదు, కమిటీల ఏర్పాటుపై కీలక నిర్ణయాలు తీసుకుంటారని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ స్వయంగా తెలంగాణపై ఫోకస్ పెట్టడంతో… జనసేన శ్రేణుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది.
