
తిరుమల: కలియుగ వైకుంఠమైన తిరుమల కొండపై భక్తుల రద్దీతో పాటు శ్రీవారి లడ్డూ ప్రసాదాల విక్రయాలు సరికొత్త రికార్డును సృష్టించాయి. తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా మే 2026 ఒకే నెలలో ఏకంగా 1,21,35,528 (1.21 కోట్లకు పైగా) లడ్డూలను విక్రయించి సరికొత్త రికార్డు నమోదు చేసింది. వేసవి సెలవుల కారణంగా స్వామివారి దర్శనానికి భక్తులు భారీగా తరలిరావడంతో లడ్డూలకు ఈ స్థాయిలో డిమాండ్ పెరిగింది. గత రెండేళ్ల మే నెల రికార్డులతో పోల్చితే ఈసారి అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. మే 2024లో 1.01 కోట్ల లడ్డూలు, మే 2025లో 1.10 కోట్ల లడ్డూలు అమ్ముడవగా.. ఈ ఏడాది మే 2026 నాటికి ఆ సంఖ్య 1.21 కోట్లకు చేరడం విశేషం. భక్తుల అచంచల భక్తికి, టీటీడీ అద్భుత పరిపాలన నిర్వహణకు ఈ ఘనతే నిదర్శనం.

