Find Articles

అమెరికాలో బాలీవుడ్ సింగర్ సందడి.. న్యూజెర్సీ ‘ఆర్‌కే జువెల్స్’ను సందర్శించిన విశాల్ మిశ్రా!

అమెరికాలో బాలీవుడ్ సింగర్ సందడి.. న్యూజెర్సీ ‘ఆర్‌కే జువెల్స్’ను సందర్శించిన విశాల్ మిశ్రా!

న్యూజెర్సీ: బాలీవుడ్ ప్రముఖ నేపథ్య గాయకుడు, సంగీత దర్శకుడు విశాల్ మిశ్రా అమెరికాలో సందడి చేశారు. న్యూజెర్సీ (ఇసెలిన్) లోని ప్రసిద్ధ భారతీయ ఆభరణాల సంస్థ ‘ఆర్‌కే జువెల్స్’ (RK Jewels) ను ఆయన ప్రత్యేకంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆర్‌కే జువెల్స్ యాజమాన్యం విశాల్ మిశ్రాకు భారతీయ సాంప్రదాయ పద్ధతిలో ఘన స్వాగతం పలికింది. స్టోర్‌లోని విభిన్నమైన, అద్భుతమైన గోల్డ్, డైమండ్ ఆభరణాల కలెక్షన్లను ఆయన ఆసక్తిగా తిలకించారు. విశాల్ మిశ్రా వస్తున్నారనే సమాచారంతో స్థానిక ప్రవాస భారతీయులు, అభిమానులు పెద్ద ఎత్తున ఆర్‌కే జువెల్స్ స్టోర్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన అభిమానులతో ఎంతో ఆత్మీయంగా ముచ్చటించారు. వారితో కలిసి సెల్ఫీలు, ఫోటోలు దిగుతూ సందడి చేశారు. ఆర్‌కే జువెల్స్ యాజమాన్యం అందించిన ఆతిథ్యంపై, అక్కడి కలెక్షన్లపై విశాల్ మిశ్రా ప్రశంసలు కురిపించారు. దీనికి సంబంధించిన విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ManaTV Team