Find Articles

“అప్పలసూరి రోడ్డున పడినా ఎవరూ గుర్తుపట్టలేదు”.. వైరల్ గా జగ్గూభాయ్ వీడియో

“అప్పలసూరి రోడ్డున పడినా ఎవరూ గుర్తుపట్టలేదు”.. వైరల్ గా జగ్గూభాయ్ వీడియో

టాలీవుడ్ సినీయర్ నటుడు జగపతి బాబు నటించిన తాజా చిత్రం ‘పెద్ది’. రామ్ చరణ్ హీరోగా నటించిన ఈ సినిమాలో ఆయన అప్పలసూరి అనే కీలక పాత్ర పోషించారు. పెద్ది సినిమా విడుదల సందర్భంగా జగపతిబాబు తన ‘ఎక్స్’ వేదికగా ఒక వీడియోను పోస్ట్ చేశారు.

‘పెద్ది’ చిత్రంలోని తన పాత్ర ‘అప్పలసూరి’ గెటప్ లో జగపతిబాబు బయటకు వెళ్లారు. భారీ ప్రోస్థటిక్ మేకప్, తెల్ల జుట్టు, పగిలిన కళ్ల అద్దాలు, పాతబడిన దుస్తులతో ఉన్న ఆయన సాధారణ వ్యక్తిలా రోడ్డుపై నడుచుకుంటూ వెళ్లారు. కానీ ఆయనను ఎవరూ గుర్తించలేదు. ఈ వీడియోను పోస్ట్ చేసిన జగ్గూభాయ్ ‘‘ అప్పలసూరి రోడ్డున పడినా కూడా ఎవరూ గుర్తు పట్టలేదు’’ అని క్యాప్షన్ జోడించారు.

ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో వచ్చిన ‘పెద్ది’ రూరల్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా. ఇందులో జగపతి బాబు పోషించిన అప్పలసూరి పాత్ర ఎప్పటికీ గుర్తుండిపోతుందని పేర్కొన్నారు. ఈ విలక్షణమైన రూపాన్ని తీర్చిదిద్దిన దర్శకుడు బుచ్చిబాబుతో పాటు జాతీయ అవార్డు గ్రహీత, మేకప్ ఆర్టిస్ట్ రషీద్ లను ఆయన కొనియాడారు.

ManaTV Team