Find Articles

అట్లాంటాలో భద్రాచలం శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవం

అట్లాంటాలో భద్రాచలం శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవం

అమెరికాలోని అట్లాంటా నగరంలో నివసిస్తున్న తెలుగు భక్తులకు అరుదైన ఆధ్యాత్మిక అవకాశాన్ని Hindu Temple of Atlanta కల్పిస్తోంది. భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం నుంచి పవిత్ర ఉత్సవ విగ్రహాలు, అర్చకులు విచ్చేసి శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించనున్నారు. సంప్రదాయ వేద, ఆగమ శాస్త్ర పద్ధతుల ప్రకారం జరిగే ఈ దివ్య వేడుకలో పాల్గొనడం ద్వారా శాంతి, సౌభాగ్యం, కుటుంబ ఐక్యత, దాంపత్య సుఖం, ఆధ్యాత్మిక పురోగతి కలుగుతాయని భక్తుల విశ్వాసం. భద్రాచలం ఉత్సవ విగ్రహాల సన్నిధిలో, అక్కడి అర్చకుల చేత నిర్వహించబడే ఈ కళ్యాణాన్ని ప్రత్యక్షంగా వీక్షించడం అట్లాంటా ప్రాంత భక్తులకు అరుదైన అవకాశం కానుంది.

కార్యక్రమ వివరాలు:

తేదీ: జూన్ 14, 2026 (ఆదివారం)

సమయం: ఉదయం 10:30 గంటలకు

వేదిక: Hindu Temple of Atlanta, Riverdale, Georgia

స్పాన్సర్‌షిప్ అవకాశాలు

గ్రాండ్ స్పాన్సర్‌షిప్ – $1,116

శ్రీ సీతారామ కళ్యాణం స్పాన్సర్‌షిప్ – $501

కళ్యాణం & అన్నసంతర్పణ – $251

సామూహిక కళ్యాణం స్పాన్సర్‌షిప్ – $51

సాధారణ విరాళం – ఏ మొత్తమైనా

ఈ మహోత్సవంలో పాల్గొనే భక్తులకు కళ్యాణ అక్షింతలు, ప్రసాదాలు, ప్రత్యేక ఆశీర్వాదాలు అందించనున్నారు.

రిజిస్ట్రేషన్, స్పాన్సర్‌షిప్ కోసం:

hindutempleofatlanta.org

ManaTV Team