
బీసీసీఐ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇటీవలే టీమిండియాకు టీ20 ప్రపంచకప్ అందించిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌పై వేటు వేసేందుకు సిద్ధమైందని తెలుస్తోంది.అతని స్థానంలో యువ ఆటగాడు శ్రేయస్ అయ్యర్‌ను కొత్త టీ20 కెప్టెన్‌గా నియమించనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారని సమాచారం.
2023 డిసెంబర్లో చివరిసారిగా టీమిండియా టీ20 జట్టుకు ఆడిన శ్రేయస్ అయ్యర్, ఇటీవల ముగిసిన ఐపీఎల్ 2026 సీజన్లో పంజాబ్ కింగ్స్ తరఫున అద్భుతంగా రాణించారు. 498 పరుగులు చేసి తన ఫామ్‌ను నిరూపించుకున్నారు. ఈ నేపథ్యంలోనే అతనికి ఏకంగా కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించాలని సెలక్టర్లు భావిస్తున్నారని సమాచారం.త్వరలో జరగనున్న ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనలకు శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోనే టీమిండియా బరిలోకి దిగనుంది.
మరోవైపు ప్రపంచకప్ గెలిపించినప్పటికీ సూర్యకుమార్ యాదవ్ వ్యక్తిగత ఫామ్ ఆందోళనకరంగా మారిన సంగతి తెలిసిందే. ప్రపంచకప్‌లో 9 మ్యాచ్‌ల్లో కేవలం 242 పరుగులు చేసిన సూర్య, ఐపీఎల్‌లోనూ ముంబై ఇండియన్స్ తరఫున 270 పరుగులకే పరిమితమయ్యారు.ఈ కారణంగానే అతనిపై వేటు వేయాలని బీసీసీఐ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

