Find Articles

ఇంగ్లండ్‌తో రెండో టీ20.. వైభవ్ సూర్యవంశీ అరంగేట్రం.?

ఇంగ్లండ్‌తో రెండో టీ20.. వైభవ్ సూర్యవంశీ అరంగేట్రం.?

క్రికెట్ ఫ్యాన్స్ అంతా ఎప్పుడా.. ఎప్పుడా.. అని ఎదురుచూస్తోన్న క్షణం వచ్చేసింది. యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఎంట్రీకి రంగం సిద్ధమైంది. ఇంగ్లండ్‌తో రెండో టీ20లో అరంగేట్రం చేయనున్నారు. భారత వైస్ కెప్టెన్ తిలక్ వర్మ నుంచి క్యాప్ అందుకున్నారు. దీంతో 15 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ అరంగేట్రం చేసిన తొలి ప్లేయర్‌గా వైభవ్ చరిత్ర సృష్టించారు. ఈ క్రమంలో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ రికార్డును బ్రేక్ చేశారు.

సచిన్ 16 ఏళ్ల వయసులో ఇంటర్నేషనల్ డెబ్యూ చేయగా.. వైభవ్ 15 సంవత్సరాల 99 రోజులకే అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టడం విశేషం. మాంచెస్టర్ వేదికగా జరుగనున్న రెండో టీ20లో టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో ఇంగ్లండ్ తొలుత ఫీల్డింగ్ చేయనుంది. కాగా వరుస మ్యాచులలో ఫెయిల్ అయిన సంజు శాంసన్‌పై వేటు పడింది. అతడి స్థానంలోనే వైభవ్ సూర్యవంశీ ఆడనున్నారు.

భారత జట్టు:
శ్రేయస్ అయ్యర్(కెప్టెన్), ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హర్షిత్ రాణా, శివం దూబె, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్.

ఇంగ్లండ్ జట్టు:
హ్యారీ బ్రూక్(కెప్టెన్), జోస్ బట్లర్(వికెట్ కీపర్), ఫిల్ సాల్ట్, టామ్ బాంటన్, శామ్ కరన్, లియామ్ డాసన్, జాకబ్ బెథెల్, ఆదిల్ రషీద్, విల్ జాక్స్, జోఫ్రా ఆర్చర్, టంగ్.

ManaTV Team