
టాలీవుడ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం ఆయన ‘పూరీ కనెక్ట్స్’ బ్యానర్‌పై విజయ్ సేతుపతి, సంయుక్త మీనన్ జంటగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘స్లమ్‌డాగ్-33‘. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతుంది.అయితే, తాజాగా పూరీ జగన్నాథ్ సోషల్ మీడియాలో పెట్టిన ఒక పోస్ట్ ఇండస్ట్రీలో సంచలనంగా మారింది.
“ప్రతి ఒక్కరూ దొంగే.. ఇక్కడ మంచివాళ్లకు అస్సలు చోటు లేదు” అంటూ పూరీ తన పోస్ట్‌లో రాసుకొచ్చారు.దీనికి తీవ్ర నిరాశను, ఆగ్రహాన్ని వ్యక్తం చేసే ఎమోజీలను కూడా జోడించారు. దీంతో పూరీని ఇంతలా బాధపెట్టిన ఆ సంఘటన ఏంటనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.ఈ పోస్ట్ పై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఆయన తీసిన ‘లైగర్’, ‘డబుల్ ఇస్మార్ట్ శంకర్’ సినిమాల డిస్ట్రిబ్యూటర్లతో ఉన్న ఆర్థిక వివాదాల వల్లే పూరీ ఇలా స్పందించారా? లేక ఏదైనా వ్యక్తిగత మోసం జరిగిందా? అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.పూరీ జగన్నాథ్ ఎవరి పేరునూ నేరుగా ప్రస్తావించనప్పటికీ, ఆయన పెట్టిన పోస్ట్ వెనుక బలమైన కారణమే ఉంటుందని భావిస్తున్నారు.దీంతో ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.

