
గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కేవలం సిల్వర్ స్క్రీన్ పైనే కాదు, వంటింటిలో కూడా తన ప్రతిభను చాటుకుంటున్నారు. తాజాగా తారక్ మొదటిసారి కుకీస్ బేక్ చేశారు. ఈ సందర్భంలోనే ఓ అభిమానికి బిగ్ సర్ ప్రైజ్ ఇచ్చారు.
ఎన్టీఆర్ తాను చేసిన కుకీస్ ఫొటోను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. అది చూసిన ఓ అభిమాని ఇలా కామెంట్ చేశారు. ‘‘ మా ఇంటిలో ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు. మాకు కూడా రెండు కుకీస్ పంపిస్తావా అన్నా.?’’ అని కామెంట్ చేశాడు. దీనికి తారక్ ఏ మాత్రం ఆలస్యం చేయకుండా అడ్రస్ పెట్టు అంటూ కింగ్ సినిమాలోని బ్రహ్మానందం పాపులర్ మీమ్ డైలాగ్ తో రిప్లై ఇచ్చారు. అయితే, ఎన్టీఆర్ కేవలం రిప్లైతోనే ఆగిపోలేదు. అన్న మాట ప్రకారం ఆ అభిమాని ఇంటికి నిజంగానే కుకీస్ పంపించి సర్ ప్రైజ్ చేశారు. దీంతో ఈ విషయం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
