Find Articles

టీమిండియా టీ20 క్రికెట్‌లో సరికొత్త అధ్యాయం.. కెప్టెన్సీపై సాగుతున్న ఉత్కంఠకు బ్రేక్

టీమిండియా టీ20 క్రికెట్‌లో సరికొత్త అధ్యాయం.. కెప్టెన్సీపై సాగుతున్న ఉత్కంఠకు బ్రేక్

టీమిండియా టీ20 క్రికెట్‌లో సరికొత్త అధ్యాయం ప్రారంభమైంది. గత కొన్ని రోజులుగా టీ20 కెప్టెన్సీపై సాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. ఈ మేరకు ముంబైలోని బీసీసీఐ ప్రధాన కార్యాలయం ఒక సంచలన నిర్ణయాన్ని ప్రకటించింది.

భారత టీ20 కెప్టెన్‌గా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్‌ను నియమిస్తూ సెలెక్టర్లు నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో జూన్ 26 నుంచి జరగబోయే ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనల నుంచే ఆయన సారథిగా బాధ్యతలు చేపట్టనున్నారు. గతేడాది మార్చిలో జరిగిన టీ20 వరల్డ్‌కప్ టైటిల్ గెలవడంలో సూర్యకుమార్ కీలక పాత్ర పోషించినప్పటికీ, ఆ తర్వాత ఫామ్ కోల్పోవడంతో బోర్డు కొత్త కెప్టెన్ వైపు దృష్టి సారించింది. అలాగే రానున్న 2028 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్ తో పాటు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లలో జరిగే 2028 టీ20 ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుని బోర్డు ఈ నిర్ణయం తీసుకుందని సమాచారం.

భారత క్రికెట్‌లో ఐసీసీ ట్రోఫీ గెలిచిన వెంటనే కెప్టెన్‌ను మార్చడం ఇది వరుసగా రెండోసారి. 2025 మార్చిలో రోహిత్ శర్మ నేతృత్వంలో భారత్ ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన కొద్ది రోజులకే వన్డే కెప్టెన్సీ బాధ్యతలను శుభ్‌మన్ గిల్‌కు అప్పగించారు. ఇప్పుడు భారత టీ20 జట్టు కెప్టెన్సీ బాధ్యతలను సూర్యకుమార్ స్థానంలో శ్రేయస్ అయ్యర్ కు అప్పగించారు.

ManaTV Team