
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లేటెస్ట్ మూవీ ‘పెద్ది’. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్న ఈ సినిమాపై ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రశంసల వర్షం కురిపించారు. ముఖ్యంగా రామ్ చరణ్ నటన అద్భుతమంటూ సోషల్ మీడియా వేదికగా తన ఆనందాన్ని పంచుకున్నారు.
‘పెద్ది’ చూశాను. నా ప్రియమైన రామ్ చరణ్ నటన మైండ్ బ్లోయింగ్‌గా ఉంది. గ్రిట్టీ, రా పెర్ఫార్మెన్స్తో పాటు అసాధారణమైన బాడీ ట్రాన్స్ఫర్మేషన్, గ్రేస్‌ఫుల్ డ్యాన్స్ మూవ్స్‌తో అదరగొట్టాడు. చరణ్ ను చూసి నిజంగా చాలా గర్వపడుతున్నాను. ఈ ప్రశంసలకు అతను అన్ని విధాలా అర్హుడు” అంటూ అల్లు అర్జున్ తన ట్వీట్లో పేర్కొన్నారు. అలాగే ఈ సినిమాలో కీలక పాత్ర పోషించిన జగపతి బాబు నటన కూడా అద్భుతంగా ఉందని కొనియాడారు.
దర్శకుడు బుచ్చిబాబు సానాపై కూడా అల్లు అర్జున్ ప్రత్యేక ప్రశంసలు కురిపించారు. ప్రతి ఒక్కరి నుంచి అద్భుతమైన నటనను రాబట్టి, చరణ్ ను అత్యున్నత స్థాయిలో నిలబెట్టిన బుచ్చిబాబు గారికి నా ప్రత్యేక అభినందనలు తెలిపారు. అదేవిధంగా ‘పెద్ది’ చిత్ర యూనిట్ కు శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం బన్నీ చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

