
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన తాజా చిత్రం ‘పెద్ది’. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా వచ్చిన ఈ సినిమా కేవలం 5 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 315 కోట్లకు పైగా గ్రాస్ వసూల్ చేసి, రికార్డు క్రియేట్ చేసింది. ఈ మేరకు చిత్ర నిర్మాణ సంస్థ వృద్ధి సినిమాస్ పోస్టర్‌ను విడుదల చేసింది.
బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ఈ నెల 4న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘పెద్ది’ మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన వసూళ్లతో దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలోనే రామ్ చరణ్ కెరీర్లోనే అత్యంత వేగంగా రూ. 300 కోట్ల క్లబ్లో చేరిన సోలో చిత్రంగా ‘పెద్ది’ రికార్డు సృష్టించింది. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించగా, కన్నడ స్టార్ హీరో శివ రాజ్‌కుమార్ ఒక కీలక పాత్ర పోషించారు. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందించిన ఈ సినిమాను సుకుమార్ రైటింగ్స్, జియో స్టూడియోస్ సమర్పణలో వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు నిర్మించారు.

