
అమెరికాలోని అట్లాంటా నగరంలో హార్ట్‌ఫుల్‌నెస్ ఇన్‌స్టిట్యూట్ ఆధ్వర్యంలో నూతన ధ్యాన కేంద్రం ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా హార్ట్‌ఫుల్‌నెస్ సభ్యులు, స్థానిక కమ్యూనిటీ నాయకులు, ఆధ్యాత్మిక సాధకులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. కొత్త ధ్యాన కేంద్రం ప్రారంభం హార్ట్‌ఫుల్‌నెస్ ఉద్యమానికి మరో మైలురాయిగా నిలిచిందని సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. కొత్త కేంద్రం ద్వారా అట్లాంటా ప్రాంత ప్రజలకు ధ్యానం, వ్యక్తిత్వ వికాసం, మానసిక ప్రశాంతతకు సంబంధించిన కార్యక్రమాలు మరింత విస్తృతంగా అందుబాటులోకి రానున్నాయని నిర్వాహకులు వెల్లడించారు.

