
టాలీవుడ్ మ్యాచో స్టార్ గోపీచంద్ తన పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు అదిరిపోయే సర్ ప్రైజ్ ఇచ్చారు. ఆయన హీరోగా రాబోతున్న 34వ చిత్రానికి సంబంధించిన టైటిల్‌ను అధికారికంగా ప్రకటించారు. పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్గా వస్తున్న ఈ సినిమాకు ‘సింగ’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ మేరకు చిత్ర యూనిట్ ఓ స్పెషల్ టైటిల్ గ్లింప్స్‌ను రిలీజ్ చేసింది.
‘ గాయపడిన అడవికి అతడే ప్రళయం.. పవిత్రతకు ముప్పు వస్తే అతడే రక్షణ కవచం” అంటూ గ్లింప్స్‌లో వినిపించిన వాయిస్ సినిమాపై భారీ హైప్ ను క్రియేట్ చేస్తోంది. టైటిల్‌కు తగ్గట్టే గోపీచంద్ ఈ సినిమాలో పవర్ఫుల్ పాత్రలో కనిపించనున్నారని తెలుస్తోంది. వి.వెంకట్ డైరెక్షన్ లో వస్తున్న ఈ చిత్రాన్ని 70ఎంఎం ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మొత్తంగా గోపిచంద్ బర్త్ డే సందర్భంగా విడుదలైన ‘సింగ’ టైటిల్ గ్లింప్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతుంది.
