Find Articles

పవన్ కళ్యాణ్ దీక్ష ప్రారంభం.. కార్తీక మాసం వరకు ప్రత్యేక నియమాలు

పవన్ కళ్యాణ్ దీక్ష ప్రారంభం.. కార్తీక మాసం వరకు ప్రత్యేక నియమాలు

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ బుధవారం ఉదయం మంగళగిరిలో శ్రీ పానకాల స్వామికి అర్చనలు చేయించి దీక్ష చేపట్టారు. ఏటా జ్యేష్ఠ మాసంలో ప్రారంభించి, కార్తీక మాసంలో దీక్ష విరమిస్తారు.గురుముఖత స్వీకరించిన మంత్రోపదేశం ఆచరణ కోసం ఈ దీక్ష క్రమం తప్పకుండా ప్రతి ఏటా చేస్తున్నారు. నియమితమైన జీవనంతోపాటు సాత్విక ఆహారం మాత్రమే తీసుకుంటారు. విధి నిర్వహణకు అనుగుణంగా వస్త్రాలు ధరిస్తారు. ఎక్కువగా చందన వర్ణ వస్త్రధారణను అవలంబిస్తుంటారు. నిత్యం అనుష్ఠానం, దేవతారాధనగావిస్తారు. సమయానుకూలంగా ధ్యానం, మంత్ర పారాయణం చేస్తారు.

ManaTV Team