టాలీవుడ్ నటుడు మంచు మనోజ్, ఆయన సతీమణి భూమా మౌనిక రెడ్డి వ్యాపార, పారిశ్రామిక రంగంలోకి అడుగుపెట్టారు. ‘నమస్తే వరల్డ్’ అనే స్టార్టప్ కంపెనీ ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో భారీ తయారీ యూనిట్ ఏర్పాటు చేయడానికి సిద్ధమయ్యారు.
కర్నూలు జిల్లా ఓర్వకల్లు పారిశ్రామిక పార్కులో సుమారు రూ.36.24 కోట్ల పెట్టుబడితో ఈ యూనిట్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఇందులో భారతీయ సంప్రదాయ బొమ్మలు, హస్తకళా ఉత్పత్తులను తయారు చేయనున్నారు. భారతీయ కళలు, సంస్కృతి, సంప్రదాయాలకు ప్రోత్సాహం అందించడమే ఈ సంస్థ ప్రధాన లక్ష్యంగా పెట్టుకుంది.
ఈ పరిశ్రమ ఏర్పాటుతో స్థానిక యువతకు, మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించనున్నారు. స్థానిక కళాకారులకు, చేతివృత్తుల వారికి కూడా ప్రయోజనం చేకూరే అవకాశం ఉంది.
సినీ రంగంలో నటుడిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మంచు మనోజ్, రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబానికి చెందిన భూమా మౌనిక రెడ్డి ఇప్పుడు పారిశ్రామికవేత్తలుగా కొత్త ప్రయాణాన్ని ప్రారంభించడం ఆసక్తికరంగా మారింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సహకారంతో ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్తున్నారు.